ఒమిక్రాన్ ఎంట్రీతో థర్డ్‌వే ప్రారంభమై భారీ స్థాయిలో వెలుగు చూసిన కరోనా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య.. ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టింది.. లక్షలు దాటిన కేసుల సంఖ్య.. ఇప్పుడు వేలలోకి పడిపోయింది.. మరికొన్ని రోజుల్లో అది వందల్లోకి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.. అయితే, కోవిడ్ కట్టడికోసం.. తీసుకోవాల్సిన చర్యలపై గతంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రత తగ్గుతున్నందున కోవిడ్…
సంక్రాంతి సెలవులు, కరోనా నిబంధనల అనంతరం పాఠశాలలు ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇవాళ్టి నుంచి తెరుచుకుంటున్నాయి. కరోనా మూడో దశ, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల సంక్రాంతి సెలవులను జనవరి 31 వరకు పొడిగించారు. మళ్లీ వాటిని తెరిచేందుకు సర్కార్ అనుమతి ఇవ్వడంతో అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మంగళవారం నుంచి తెరచుకోనున్నాయి. సంక్రాంతి సెలవుల్లో…
కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తితో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించింది. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆలయాల్లో ప్రతి ఏడాది నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాలను సైతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడిస్తున్నారు.…
కోవిడ్ నిబంధనలు పాటించడం లో మనుషులకు ఆదర్శంగా నిస్తున్నాయి కోతులు. భౌతిక దూరం పాటిస్తూ ఆహారం తీసుకుంటున్న ఘటన పుత్తూరు మండలం కైలాసకోన పర్యాటక కేంద్రం వద్ద చోటు చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా పర్యాటక కేంద్రం మూతపడడంతో కోతులకు ఆహరం అందడం లేదు. దాంతో కోతులకు ఆహారం పెట్టడానికి సిద్ధపడింది కైలాసనాధ ఆలయ కమిటీ. కోతులు భౌతిక దూరం పాటించేలా రోడ్డుపై మార్కింగ్ చేసారు కమిటీ సభ్యులు. అయితే క్రమం తప్పకుండా ఆ మార్కింగ్ లో…