Kejriwal: మాయావతి ఇల్లు కోరిన కేజ్రీవాల్! ఆప్ అధ్యక్షుడికి ఏ బంగ్లా కేటాయించారంటే..!
- మాయావతి ఇల్లు కోరిన కేజ్రీవాల్!
- ఆప్ అధ్యక్షుడికి వేరే బంగ్లా కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లా కేటాయించారు. ఏడాది తర్వాత కొత్త బంగ్లాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నవంబర్ 4, 2024న ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. వాస్తవంగా 10 రోజుల్లోనే జాతీయ అధ్యక్షుడికి ఢిల్లీలో అధికారికంగా ప్రభుత్వ బంగ్లాను ఏర్పాటు చేయాలి.. కానీ ఇప్పటి వరకు కేటాయించలేదు. తాజాగా కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం బంగ్లా కేటాయించింది.
ఇది కూడా చదవండి: Singer Maithili Thakur: మోడీచే ప్రశంసలు.. ఇప్పుడు బీహార్ బీజేపీ మంతనాలు.. మైథిలి ఠాకూర్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమా?
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
ఇక బంగ్లా కేటాయింపుల్లో భాగంగా కేజ్రీవాల్.. గతంలో మాయావతి నివాసం ఉన్న రోడ్డు నెంబర్ 35, లోధి ఎస్టేట్‌లోని బంగ్లాను కేటాయించాలని కోరారు. కానీ ఆ బంగ్లాను ప్రస్తుతం వేరే కేంద్రమంత్రికి కేటాయించేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా మరొక బంగ్లాలోకి వెళ్లాల్సి వచ్చింది.
దాదాపు ఏడాది తర్వాత కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని 95, లోధి ఎస్టేట్‌లోని టైప్ VII బంగ్లా కేటాయించారు. జాతీయ అధ్యక్షుడిగా తనకు బంగ్లా కేటాయించలేదని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ బంగ్లా కేటాయించింది. ఈ బంగ్లా ఎదురుగానే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఉంటున్నారు. కేజ్రీవాల్ ఈ బంగ్లాలోకి మకాం మారిస్తే మాత్రం.. శశిథరూర్ పొరుగువాడు అవుతారు. ఇదిలా ఉంటే గతంలో మాయావతి నివాసం ఉన్న 35, లోధి ఎస్టేట్‌లోని బంగ్లాను కేటాయించాలని కేజ్రీవాల్ అభ్యర్థించారు. కానీ జూలైలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరికి ఈ బంగ్లా కేటాయించడంతో ఇప్పుడు కేజ్రీవాల్‌కు వేరే బంగ్లా కేటాయించాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Bihar Assembly Election 2025: నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం కేజ్రీవాల్ ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్‌కు కేటాయించిన 5వ నెంబర్ ఫిరోజ్‌షా రోడ్‌లోని ఇంట్లో బస చేస్తున్నారు. వాస్తవంగా జాతీయ పార్టీల అధ్యక్షులకు పద్ధతి ప్రకారం కేజ్రీవాల్‌కు పది రోజుల్లో అధికారిక వసతి లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం గతంలో ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కానీ ఏడాది తర్వాత కేంద్ర ప్రభుత్వం బంగ్లా కేటాయించింది. సోమవారమే కేజ్రీవాల్ బంగ్లాను పరిశీలించి వచ్చినట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!