ఈజీమనీ కోసం అర్రులు చాస్తున్న కొందరు కేటుగాళ్ళు వాట్సాప్ డీపీలు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫొటోలను వాట్సాప్ డిస్‌ప్లే పిక్చర్లుగా (డీపీ) పెట్టి, అనేక మందికి సందేశాలు పంపిస్తూ, అమెజాన్ గిఫ్ట్ కూపన్లు కోరి టోకరా వేస్తూ, వేయడానికి ప్రయత్నిస్తున్న కేటుగాళ్లు నైజీరియాలో ఉన్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తో పాటుగా ఢిల్లీ హైకోర్ట్ సీజే సతీష్ చంద్రతో పాటు, సహా ముగ్గురు ఉన్నతాధికారుల ఫొటోల దుర్వినియోగంపై నమోదైన కేసుల దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు ఆయా వాట్సాప్‌ల ఐపీ అడ్రస్‌లు తని ఖీ చేయగా అవన్నీ నైజీరియాలోనే ఉన్నట్లు తేలింది.
అస్సలు విషయం ఏమిటంటే 97857 43029 గల ఓ నెంబర్‌కు డీజీపీ డీపీ పెట్టి మహా కేటుగాళ్లు కొత్త విధానంతో తెరలేపారు.. ఇలా ప్రముఖుల, ఉన్నతాధికారుల పేర్లు, ఫోటోలు డీపీలుగా పెట్టి నేరగాళ్లు మెసేజులు, చాట్టింగులు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు.. ఈ ఘటనపై ఆరా తీసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాట్సప్ డీపీతో భారీ మోసం చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ చిత్రం డీపీగా ఉన్న వాట్సప్ ఖాతా నుంచి డబ్బులు కావాలంటూ వాట్సప్ మెసేజ్ పెట్టారు కొందరు సైబర్ నేరస్థులు. దీంతో రూ. 2 లక్షల అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపారు తెలంగాణ హైకోర్టు అధికారి. ఆయన తెలంగాణ హైకోర్టులో ప్రధానన్యాయమూర్తిగా పనిచేసి ఇటీవలే ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
Shivashankar 13 Marriages: 11 కాదు 13.. శివశంకర్ పెళ్లిళ్ళ కథ
ఇక్కడి హై కోర్టులో పనిచేస్తున్న శ్రీమన్నారాయణకు ఆయన డీపీ ఉన్న వాట్సప్ ద్వారా మెసేజ్ చేశారు సైబర్ నేరస్థులు. నేనిప్పుడు ప్రత్యేక సమావేశంలో ఉన్నానని డబ్బులు అత్యవసరం. ప్రస్తుతం నా దగ్గరున్న కార్డులన్నీ బ్లాక్ అయ్యాయి. మీకో అమెజాన్ లింక్ పంపిస్తాను. దానిని క్లిక్ చేసి 2 లక్షల విలువ చేసే గిఫ్ట్ కార్డులు పంపించాలి అని చెప్పి మోసం చేశారు సైబర్ కేటుగాళ్ళు. నిజమేనని నమ్మి 2 లక్షల విలువ చేసే గిఫ్ట్ కార్డులు పంపాడు శ్రీమన్నారాయణ. ఆ తర్వాత విషయం బయట పడటంతో.. సైబర్ నేరస్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలోనే ఉంటూ నేరాలు చేసే నైజీరియన్లు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని వాడుతుంటారు. వీళ్లు బాధితులను బుట్టలో వేసుకోవడానికి అవసరమైన ఫోన్లు చేయడానికి బోగస్ వివరాలతో సిమ్‌కార్డులు తీసుకుంటారు. ఈ నంబర్లకు సంబంధించిన వాట్సాప్‌ను మాత్రం నైజీరియాలోని తమ అనుచరులతో యాక్టివేట్ చేయిస్తారు. అక్కడి వాళ్లు వైఫై ద్వారా వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటారు. అందుకు అవసరమైన కోడ్ మాత్రం ఇక్కడి వ్యక్తి దగ్గర ఉన్న నంబర్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. దీన్ని వీళ్లు నైజీరియాలోని వారికి చెప్పడంతో వాళ్లు ఎంటర్ చేసుకుని వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. గతంలో సైబర్ నేరగాళ్లు తమ సందేశాలు అందుకున్న వారి నుంచి డబ్బు అడిగి ఆన్‌లైన్ ద్వారా లేదా వివిధ వ్యాలెట్స్‌కు పంపాలని కోరేవారు. విషయం పోలీసుల వరకు వెళ్లి దర్యాప్తు చేపడితే నగదు చేరిన నంబర్ ఆధారంగా వీరి వివరాలు బయటపడేవి. ఇటీవల కాలంలో ఎక్కువగా అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపాలని కోరుతున్నారు. నిర్ణీత మొత్తానికి వీటికి ఖరీదు చేస్తున్న బాధితులు దానికి సంబంధించిన లింకులను షేర్ చేస్తున్నారు. వీటిని ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా రీడీమ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది.
వాట్సాప్ సిద్ధం చేసుకుంటున్న నైజీరియన్లు అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే ప్రముఖ సంస్థల, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల వివరాలు, ఫొటోలు తీసుకుంటున్నారు. ప్రొఫైల్ నేమ్, అబౌట్ తదితరాలను డీపీగా ఎంచుకున్న ఫొటోకు తగ్గట్టే సిద్ధం చేసుకుంటారు. ఈ నంబర్ నుంచి సదరు అధికారి కింద పని చేసే వారికి సందేశాలు పంపుతారు. కేవలం డీపీలు మాత్రమే చూస్తూ ఆ సందేశం తమ అధికారి నుంచే వచ్చినట్లు భావించి స్పందిస్తున్నారు. ఈ తరహా కుంభకోణాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. డీపీ ఫ్రాడ్స్‌ల్లో ఉన్నతాధికారులు, సెలబ్రెటీల ఫొటోలు వినియోగిస్తారు. ఎవరికైనా తమ పై అధికారులు, పరిచయస్తుల నుంచి డబ్బు, గిఫ్ట్ కూపన్లు పంపాలంటూ సందేశాలు వస్తే గుడ్డిగా నమ్మొద్దంటున్నారు. మీకు సందేశం వచ్చిన వాట్సాప్‌కు సంబంధించిన ఫోన్ నంబర్‌ను పరిశీలించాలి. అది వాళ్లు నిత్యం వినియోగించేది కాకపోతే వ్యక్తిగతంగా లేదా ఫోన్ ద్వారా సంప్రదించాలని పోలీసులు సలహా ఇస్తున్నారు.
Uday Shankar: వరద బాధితుల సహాయార్థం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ టీమ్ రూ. 2 లక్షల విరాళం!