దేశంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇప్పటి వరకు అనేక మంది ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. తాజాగా జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నుంచి భద్రతా దళాలు ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కీలక ఉగ్రవాదులందరిని హతమార్చారు. తాజాగా సోమవారం కూడా జేకే కుల్గాంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.
Pahalgam terrorists: జమ్మూ కాశ్మీర్‌లో రెండు నెలల క్రితం అమాయమైన 26 మంది టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘‘ది రెస్టిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు చంపేశారు. ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకుల్ని మతం పేరు అడుగుతూ చంపేశారు. ఈ ఘటన తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయారు.
జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో రెండో రోజు ఉగ్రవాదులపై కాల్పులు కొనసాగుతున్నాయి. చత్రోలోని సింగ్‌పోరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక జవాన్ వీరమరణం పొందాడు.