Sydney Attack: ‘అహ్మద్ ఆస్ట్రేలియా హీరో’.. ఆస్పత్రిలో పరామర్శించిన ప్రధాని ఆంథోనీ
- సిడ్నీ ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన అహ్మద్
- తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితుడు
- ‘అహ్మద్ ఆస్ట్రేలియా హీరో’ అంటూ ప్రధాని ఆంథోనీ ప్రశంస
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్‌లో యూదులు లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. అయితే అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి మాత్రం.. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడాడు. ఓ వైపు బుల్లెట్లు దూసుకొస్తున్నా… ఏ మాత్రం వెరవకుండా పోరాడాడు. అతడి తెగింపును యావత్తు ప్రపంచమంతా ప్రశంసిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అహ్మద్‌ను హీరో అంటూ కొనియాడారు.
ఇది కూడా చదవండి: UN-India: ఒకరిని జైల్లో పెట్టారు.. ఇంకొకరిని అందలం ఎక్కించారు.. పాక్‌పై భారత్ ధ్వజం
Also Read
- Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
- US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్‌లలో పేలుళ్లు.. హార్ముజ్‌లో వాణిజ్య నౌకలపై కాల్పులు
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్‌లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్ అల్ అహ్మద్‌ను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘నువ్వు ఆస్ట్రేలియన్ హీరో.’’ అంటూ ప్రశంసించారు. దశాబ్దాల్లో దేశంలో అత్యంత ఘోరమైన తుపాకీ దాడిని ఆపడంలో అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించాడంటూ కొనియాడారు. ఆస్ట్రేలియా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mexico Video: మెక్సికోలో కూలిన విమానం.. ఏడుగురు మృతి
అహ్మద్ అల్ అహ్మద్‌ది సిరియా దేశం. ప్రశాంతంగా జీవితాన్ని గడిపేందుకు ఆస్ట్రేలియా వలస వచ్చి బ్రతుకుతున్నాడు. 2022లో ఆస్ట్రేలియా పౌరసత్వం లభించింది. ప్రస్తుతం పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం బోండి బీచ్ దగ్గర ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో అహ్మద్‌కు అనేక గాయాలయ్యాయి. ఎడమ చేతికి ఒక బుల్లెట్, ఎడమ భుజంపై గాయం అయింది. ఇంకా బుల్లెట్‌ను తొలగించలేదు. చేయిను తీసేయాలని చెప్పారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. ప్రస్తుతం అహ్మద్‌కు ప్రపంచ వ్యాప్తంగా సహాయ సహకారాలు.. మద్దతు లభిస్తోంది. బోండి బీచ్ కాల్పుల్లో నిందితుడి సహా 16 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
Ahmed, you are an Australian hero.
You put yourself at risk to save others, running towards danger on Bondi Beach and disarming a terrorist.
In the worst of times, we see the best of Australians. And that's exactly what we saw on Sunday night.
On behalf of every Australian, I… pic.twitter.com/mAoObU3TZD
— Anthony Albanese (@AlboMP) December 16, 2025
Ahmed, thank you on behalf of every Australian. pic.twitter.com/H7RXr5o9sc
— Anthony Albanese (@AlboMP) December 16, 2025
The hero of Bondi Beach, is NOT a Muslim!
He’s a Maronite Christian ✝️
(A Christian sect of Middle Eastern believers in Jesus Christ)He is From Lebanon. This his name is Arabic, Ahmed Al Ahmed, but he is a Christian.
Praise God for his courage. 🙏
pic.twitter.com/QLqRRLx5ml— Doug Sides (@DougSides) December 15, 2025
తాజావార్తలు
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
-
South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
-
Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
-
Vaibhav-BCCI: వైభవ్‌కు అవకాశం ఇవ్వాల్సింది కాదు.. బీసీసీఐ తప్పు చేసింది.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?