దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఇండియా కూటమికి ఇచ్చిన విందులో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీజేపీ-ఎన్నికల సంఘం ఓట్ల కుట్ర చేసిందని తీవ్రంగా ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
తాజాగా రాహుల్‌గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్ చేసిన ఆరోపణలు అసంబద్ధ విశ్లేషణగా పేర్కొంది. తప్పుదోవ పట్టించే వివరణలు వ్యాప్తి చేసినందుకు ప్రమాణం చేసి ఫిర్యాదు సమర్పించాలని.. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని ఎన్నికల కమిషన్ డిమాండ్ చేసింది. భారత ఎన్నికల కమిషన్‌పై చేసిన ఆరోపణలు రాహుల్‌గాంధీ విశ్వసిస్తే.. డిక్లరేషన్‌పై సంతకం చేసి ఇవ్వాలని కోరింది. ఒక వేళ డిక్లరేషన్‌పై సంతకం చేయకపోతే విశ్లేషణ, తీర్మానాలు అసంబద్ధమైనవిగా పరిగణించాల్సి వస్తుందని తెలిపింది. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
ఇది కూడా చదవండి: Trump Tariffs Effect: భయపడ్డ అమెజాన్, వాల్‌మార్ట్.. భారత్ స్టాక్ నిలిపివేత!
బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించడానికి గురువారం సాయంత్రం రాహుల్ గాంధీ ఇండియా కూటమికి విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఓటర్ల మోసం గురించి ఆరోపణలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ విభాగంలో భారీ ఓటర్ల మోసం బయటపడిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఇక రాహుల్ ఆరోపణలను బీజేపీ కూడా తీవ్రంగా ఖండించింది. ఆరోపణలు నిజమైతే అందుకు సంబంధించిన వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను సమర్పించాలని కోరింది. రాహుల్ వాటిని సమర్పించడంలో విఫలమైతే.. అవాస్తవాలని స్పష్టమవుతుందని చెప్పింది.
LoP Shri @RahulGandhi briefs INDIA alliance leaders on #VoteChori, sharing key insights and evidence.
A united front against electoral manipulation!
📍 New Delhi pic.twitter.com/UhJfROz92L
— Congress (@INCIndia) August 7, 2025