ఎన్నికల సంఘంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ యుద్ధం ప్రకటించారు. ఇటీవల ఇండియా కూటమికి విందు ఇచ్చిన సందర్భంగా ఈసీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఇండియా కూటమికి ఇచ్చిన విందులో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీజేపీ-ఎన్నికల సంఘం ఓట్ల కుట్ర చేసిందని తీవ్రంగా ఆరోపించారు.
హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు ఇంకా అనుమానాలు తీరడం లేదు. ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ వైపే ఉన్నాయి. కాంగ్రెస్‌దే అధికారం అంటూ ఊదరగొట్టాయి. కానీ ఫలితాలు వెలువడే సరికి అంతా రివర్స్ అయింది. ఊహించని విధంగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ముచ్చటగా మూడోసారి కమలం పార్టీ హ్యాట్రిక్ కొట్టింది.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే కేంద్ర పాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.