Maharashtra: మంత్రులకు శాఖలు కేటాయింపు.. షిండేకు మళ్లీ నిరాశ
- మంత్రులకు శాఖలు కేటాయింపు
- షిండేకు మళ్లీ నిరాశ
- దూరమైన హోంశాఖ పదవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడింది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మూడు పార్టీల నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. తాజాగా శనివారం ముఖ్యమంత్రి ఫడ్నవిస్.. మంత్రులకు శాఖలు కేటాయించారు. అయితే ఏక్‌నాథ్ షిండేకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆయన ఆశించిన హోంశాఖ దక్కలేదు. ముఖ్యమంత్రి పదవి కోసం చాలా రోజులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో హోంశాఖ అయినా దొరుకుతుందని ఆశ పడ్డారు. తీరా ఆ శాఖ కూడా దక్కకుండా పోయింది. షిండేకు మూడు పోర్ట్‌ఫోలియోలు దక్కాయి. పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, ప్రజా పనుల ఫోలియోలు దక్కాయి.
ఫడ్నవిస్ దగ్గర హోంశాఖ, లా, న్యాయశాఖలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఫైనాన్స్, ప్లానింగ్, ఎక్సైజ్ శాఖలు కేటాయించారు. మొత్తానికి 4 వారాల చర్చల తర్వాత ఈ ఫోర్ట్‌పోలియో జరగడం విశేషం.
Also Read
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
చంద్రకాంత్ పాటిల్‌కు ఉన్నత, సాంకేతిక విద్యా శాఖను కేటాయించగా.. గణేష్ నాయక్‌కు అటవీ శాఖ బాధ్యతలు అప్పగించారు. పాఠశాల విద్యకు సంబంధించిన కీలక బాధ్యత దాదా భూసేకి అప్పగించారు. రెవెన్యూ మంత్రిగా బవాన్‌కులే, జలవనరుల శాఖకు రాధాకృష్ణ విఖే పాటిల్ నేతృత్వం వహిస్తారు. హసన్ ముష్రిఫ్ వైద్య విద్యను పర్యవేక్షించనున్నారు. అదితి తత్కరేకు మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ కేటాయించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు జయకుమార్ గోరే, సామాజిక న్యాయం కోసం సంజయ్ శిర్సత్‌కు కేటాయించారు. ధనంజయ్ ముండేకు ఆహార మరియు పౌర సరఫరాల శాఖను అప్పగించారు. అశోక్ ఉయికే గిరిజన అభివృద్ధి మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహించనన్నారు. ఆశిష్ షెలార్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కల్చర్ శాఖలు ఇవ్వబడ్డాయి. ఉదయ్ సమంత్‌కు పరిశ్రమల శాఖను కేటాయించారు. పంకజా ముండేకు పర్యావరణ మంత్రిత్వ శాఖను ఇవ్వగా.. మాణిక్‌రావు కొకాటేకు కీలకమైన వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 స్థానాలకు గాను మహాయుతి కూటమి 230 స్థానాల్లో గెలిపొందింది. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించింది. అయితే షిండే తిరిగి సీఎం పదవి ఆశించారు. కానీ ఆ పదవిని బీజేపీ దక్కించుకుంది. కనీసం హోంశాఖ అయినా దక్కుతుందని ఆశించారు. చివరికి ఆ పదవి కూడా దూరమైపోయింది.
తాజావార్తలు
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
-
Crude Oil Price Today: బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి