Yamuna River: యమునా వరదల ఎఫెక్ట్.. ఢిల్లీకి 2 రోజులు నీళ్లు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yamuna River: ఢిల్లీతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. వరద నీరు పోటెత్తడంతో ఆల్‌టైం రికార్డ్‌స్థాయికి చేరుకుంది. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ పరిసరాలు నీట మునిగాయి. సీఎం కేజ్రీవాల్ ఆఫీసు కూడా జలమయం అయ్యింది. ఇక వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నీట మునిగింది. దీంతో ఆ ప్లాంట్‌ను మూసివేశారు. రెండు రోజుల పాటు ఢిల్లీకి తాగు నీటి సరఫరా నిలిచిపోనుంది.
Read also: Rashi Khanna Saree Pics: పట్టు చీరలో రాశి ఖన్నా.. అందానికే అసూయ కలిగేలా మెరిసిపోతుంది!
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
యమునా నది రికార్డు స్థాయిలో ప్రవహిస్తున్న కారణంగా.. ఢిల్లీలోని వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను మూసివేశారు. యమునా నదిలో నీటి స్థాయి పెరగడంతో ఆ ప్లాంట్‌ను బంద్ చేశారు. ఇవాళ ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ ప్లాంట్‌ను విజిట్ చేశారు. తొలిసారి యమునా నదిలో ఈ స్థాయిలో నీరు వచ్చినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. పంపులు, మెషీన్లలోకి నీరు ప్రవేశించడం వల్ల మూడు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మూసివేసినట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. దీని కారణంగా ఢిల్లీలో సుమారు 25 శాతం నీటి సరఫరా తగ్గిపోతుందని ఆయన తెలిపారు. బోర్లను కూడా మూసివేసినట్లు ఆయన చెప్పారు. ఒకటి లేదా రెండు రోజుల పాటు ఢిల్లీలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లు సీఎం తెలిపారు. శుక్రవారం సాయంత్రం తర్వాత మళ్లీ నీటి సరఫరా పునరుద్దరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు సీఎం కేజ్రీ వెల్లడించారు.
Read also: HBD Sanjosh: హీరో సంజోష్ కొత్త చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్
కేంద్ర జల సంఘం ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు యమునా నది ప్రవాహం హెచ్చు స్థాయికి చేరుకుంటుందని.. ఆ తర్వాత నీటి మట్టం తగ్గడం ప్రారంభం అవుతుందని సీఎం తెలిపారు. ఢిల్లీలో యమునా నీటి మట్టం 208.46 మీటర్ల స్థాయికి చేరుకున్నది. సీఎం కేజ్రీవాల్ ఇంటి చుట్టు కూడా యమునా నది నీరు చేరుకున్నట్లు తెలుస్తోంది. సెక్రటేరియేట్ క్యాంపస్‌లోనే కేజ్రీవాల్ ఇల్లు ఉన్నది. ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, సీనియర్ అధికారుల ఇండ్లు కూడా అక్కడే ఉన్నాయి. రాజ్‌ఘాట్ నుంచి సెక్రటేరియ్‌కు వెళ్తున్న రోడ్డు జలమయం అయ్యింది. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్‌ను క్లోజ్ చేశారు. గురువారం ఉదయం 7 గంటలకు నదిలో 208.46 మీటర్ల మేర వరద ప్రవాహం ఉంది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది. యమునా నది ఈ స్థాయిలో ప్రవహించడం చరిత్రలో ఇదే తొలిసారి. 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!