బెట్టింగ్.. బెట్టింగ్.. కొందరి జీవితాలను మారిస్తే.. మరికొన్ని జీవితాలు ఆదిలోనే అంతం చేస్తుంది..ఇలాంటివి చట్ట రీత్యా నేరం అయిన కొందరు బెట్టింగ్ రాయులు మాత్రం ఇలాంటివి చేస్తుంటారు.. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ ల వల్ల ఎందరో జీవితాలను కోల్పోయారు.. తాజాగా ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్ వల్ల ప్రాణాన్ని కోల్పోయాడు.. బెట్టింగ్ కోసం చేసిన అప్పు వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయాడు.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. చేసిన అప్పు తీర్చలేక.. కుటుంబ పరువు పోతుందన్న మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు.. తనువు చాలించాడు. బెట్టింగ్ భూతానికి అనకాపల్లి జిల్లాలో యువకుడు బలయ్యాడు..
అతను చెల్లెలు పెళ్లి కోసం అప్పులు చేసిన యువకుడు.. ఆ అప్పుల నుంచి గట్టెక్కెందుకు బెట్టింగ్ వైపు మారాడు. బెట్టింగ్‌ల్లో తీవ్రంగా నష్టపోయి అప్పుల బాధలు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన 25 ఏళ్ల మణికంఠ సాయికుమార్‌కు ఇద్దరు చెల్లెలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో తోబుట్టునకు వివాహం చేసేందుకు అప్పులు చేశాడు. దాదాపు 3 లక్షల వరకు తీసుకొని పెళ్లి కోసం ఖర్చు చేశాడు. చేసినా అప్పుకు తెర్చే మార్గం లేక… బెట్టింగ్ పై ఆశలు పెట్టుకున్నాడు. బెట్టింగ్‌లో 40 వేల రూపాయలు కోల్పోయాడు..
అతను ఇంక అప్పు చేస్తే ఇక తీర్చలేను అనుకున్నాడు.. అదే విధంగా ఇప్పుడు చేసిన అప్పు కోసం బెట్టింగ్ రాయుళ్లు టార్చర్ పెట్టడంతో కుటుంబ పరువు పోతుందన్న .. మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు మణికంఠ. చేతికి అంది వచ్చినా కొడుకు ప్రాణాలు తీసుకోవడంతో ఆకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు పుట్టెడు శోకంతో కన్నీరుమున్నీరవుతున్నారు.. కూలి పని చేసుకొని అయిన బ్రతికేస్తాము.. కానీ మమ్మల్ని వదిలి వెళ్లి పోతావా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. వారి రోదనను చూసిన వాళ్లంతా కంటతడి పెట్టేస్తున్నారు.. ప్రస్తుతం ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయాలు అలుముకున్నాయి.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.. బెట్టింగ్ లు వేస్తున్న వారిని పట్టుకొనే పనిలో ఉన్నారు.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..