Suvendu Adhikari comments on TMC government: బీజేపీ నేత సువేందు అధికారి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆరు నెలులు కూడా బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండదని ఆయన గురువారం వ్యాఖ్యానించారు. అధికార టీఎంసీ ‘ కొత్త, సంస్కరించిన టీఎంసీ’ ఆరు నెలల్లో వస్తుందని పోస్టర్లు వేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో శనివారం ఉదయం కీలక పరిణామం చోటుచేసుకుంది.పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉపాధ్యాయ రిక్రూట్‌మెంట్ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని అరెస్టు చేసింది.
పశ్చిమబెంగాల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఏకంగా రూ.20 కోట్ల నగదు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడుల్లో బయటపడింది. ఇంత పెద్దమొత్తంలో పట్టుబడటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. పశ్చిమ బెంగాల్ త్రుణమూల్ కాంగ్రెస్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలి ఇంటి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకుంది ఈడీ. మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటిపై శుక్రవారం ఈడీ దాడి చేసింది. అర్పితా ఇంట్లో నోట్లు గుట్టలు గుట్టలుగా బయటపడింది.