Site icon NTV Telugu

EC-Elections: 4 రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ కసరత్తు పూర్తి.. షెడ్యూల్ ఎప్పుడంటే…!

Ec

Ec

దేశ వ్యాప్తంగా మరో మినీ ఎన్నికల యుద్ధం జరగనుంది. నాలుగు కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. త్వరలోనే నాలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ వార్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ సర్వేను ఇప్పటికే ఈసీ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎన్నికల సంఘం తుది జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: PM Modi: అస్సాంలో మోడీ పర్యటన.. మోరన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభం

ఇక సోమవారం లేదా మంగళవారం తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికల ప్రక్రియను ముగించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. త్వరలోనే విద్యార్థులకు వేసవి సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో అన్ని పార్టీలు సన్నద్ధమైపోయాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ శుక్రవారం మహిళల ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ చేశారు. ఇక ప్రధాని మోడీ కూడా ఈరోజు అస్సాంలో పర్యటించి పలు కీలక ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల సమరంలోకి దిగిపోయినట్లు కనిపిస్తోంది.

Exit mobile version