దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో గవర్నర్ పదవీకాలం ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌లో ఆనందీ బెన్ పటేల్, రాజస్థాన్‌లో కల్‌రాజ్ మిశ్రా, గుజరాత్‌లో ఆచార్య దేవవ్రత్, కేరళలో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ గవర్నర్‌ల పదవీకాలం మరో రెండు మూడు నెలల్లో ముగియనుంది. ఈ నాలుగు రాష్ట్రాలకు తదుపరి గవర్నర్ ఎవరు అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం అడ్మినిస్ట్రేటర్ బన్వారీ లాల్ పురోహిత్ ఇప్పటికే తమ పదవికి రాజీనామా చేశారు.. అయితే వారి…
బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్ రాష్ట్రాలకు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర మంత్రులను ఇంచార్జులుగా నియమించింది. రాజస్తాన్ కు ఎన్నికల ఇంచార్జ్ గా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను, హర్యానాకు జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని కర్ణాటకకు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కర్ణాటకకు ఇంచార్జులుగా నియమించారు. జూన్ 10…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటింది భారతీయ జనతా పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం తొందరపడటం లేదు. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. గోవాలో ఒక్క సీటు తక్కువైనా.. మద్దతు ఇచ్చేందుకు స్వతంత్రులు, ఎంజీపీ రెడీగా ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి సమస్యలు లేకపోయినా.. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు మాత్రం.. చాలా కసరత్తే చేస్తున్నారు. గతంలో కేంద్ర కేబినెట్ కోసం ఎంత వర్కవుట్ చేశారో..…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ… రైతులు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీ సరిహద్దులు నిరసనలతో హోరెత్తుతున్నాయి. రైతులు ఢిల్లీ రాకుండా రోడ్లను మూసేశారు. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో నెలలతరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఇదే విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. గమ్యస్థానాలకు చేరుకోవడానికి, చుట్టూ తిరిగి చాలాదూరం ప్రయాణించాల్సి వస్తోందని జాతీయ మానవహక్కుల…