DMK: లోక్‌సభ ఎన్నికలు దగ్గపడుతున్న కొద్దీ పార్టీలు తమ ప్రచార తీవ్రతను పెంచాయి. తొలి విడతలోనే తమిళనాడులోని అన్ని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార డీఎంకే బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోంది. ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోసారి ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే మనం తినే ఆహారంప కఠినమైన ఆంక్షల్ని విధిస్తారని అన్నారు. మటన్, చికెన్ తినడాన్ని నిషేధిస్తారని డీఎంకే నేత చెప్పారు. ప్రజలకు పెరుగన్న, సాంబార్ అన్నమే దిక్కవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Pakistan: హిందూ బాలిక అపహరణ.. సింధ్ వ్యాప్తంగా నిరసనలు..
తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి డీఎంకేకి, బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాట సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. దీంతో బీజేపీ ఈ రాష్ట్రంపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 39 స్థానాలకు గానూ డీఎంకే-కాంగ్రెస్ కూటమి 38 స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ చేయాలని అధికార డీఎంకే పార్టీ భావిస్తోంది.
" If Modi is elected again you can only eat Curd rice and Sambar rice, you will be banned from eating mutton, beef and chicken" DMK campaign at Chennai…😑 pic.twitter.com/glzDUR1cLH
— Vishwatma 🇮🇳 ( மோடியின் குடும்பம் ) (@HLKodo) April 1, 2024