Air India Express: దుబాయ్-అమృత్‌సర్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం పాకిస్తాన్ కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అత్యవసరంగా వైద్య సహాయం అవసరం కావడంతో దగ్గర ఉన్న కరాచీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
కరాచీలో అత్యవసర ల్యాండింగ్ తర్వాత ప్రయాణికుడికి తక్షణ వైద్య సేవలు అందించబడ్డాయి. ప్రయాణికుడికి చికిత్స అందించిన తర్వాత, ప్రయాణించేందుకు అనుమతి లభించడంతో విమానం తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు కరాచీ నుంచి అమృత్‌సర్‌కి బయలుదేరిందని ఎయిర్ లైన్ ప్రతినిధి వెల్లడించారు.
Read Also: India vs Pakistan: “ప్రేమ దుకాణం ” నుంచి ఒక్క పలుకు రాలేదు.. కాంగ్రెస్‌పై అస్సాం సీఎం ఫైర్..
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ.. మా దుబాయ్-అమృత్‌సర్ విమానంలో ఒక ప్రయాణికుడికి అకాస్మత్తుగా మెడికల్ కాంప్లికేషన్ రావడంతో, వెంటనే వైద్య సాయం అందించేందుకు కరాచీ అత్యంత దగ్గరి ప్రదేశం కావడంతో విమానాన్ని అక్కడికి మళ్లించాలని సిబ్బంది నిర్ణయించుకుందని, విమానం స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 8.51 గంటలకు దుబాయ్ నుంచి బయలుదేరితే.. మధ్యాహ్నం 12.30 గంటలకు కరాచీలో దిగింది అని చెప్పారు.
విమానయాన సంస్థ, విమానాశ్రయ అధికారులతో, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుందని, ప్రయాణికుడికి ల్యాండింగ్ తర్వాత తక్షణమే వైద్యసేవలు అందించారని, కరాచీలోని విమానాశ్రయంలో వైద్యులు అత్యవసర మందులు అందించిన తర్వాత స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు అమృత్‌సర్ బయలుదేరిందని విమానయాన సంస్థ తెలిపింది.