Mulayam Singh Yadav’s condition critical: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. ఆదివారం ఆయన్ను గురుగ్రామ్ లోని మెదాంత ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు. 82 ఏళ్ల ములాయం సింగ్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తండ్రి ఆరోగ్యంపై సమాచారం అందిన వెంటనే ఉత్తర్ ప్రదేశ్ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ హుటాహుటిన లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరారు.
సమాజ్ వాదీ వ్యవస్థాపకుడిగా ఉన్న ములాయంసింగ్ యాదవ్ ప్రస్తుతం మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ములాయం సింగ్ రెండో భార్య సాధనాగుప్తా ఈ ఏడాది జూలైలో మరణించారు. 2003లోనే ఆయన మొదటి భార్య మాల్తీదేవి మరనించారు. మాల్తీదేవి కుమారుడే అఖిలేష్ యాదవ్.
Read Also: Tamil Nadu: తాగుడుకి బానిసై… కన్నకూతురి జీవితం చిదిమేసే యత్నం
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ సుశీలా కటారియా పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ములాయం సింగ్ యూరినరీ ఇన్ఫెక్షన్ తో కూడా బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
అఖిలేష్ యాదవ్ తో పాటు ఆయన భార్య డింపుల్, శివపాల్ సింగ్ యాదవ్ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని.. యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆకాంక్షించారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.