Kolkata Doctor Case: పేదరికం నుంచి వైద్యురాలిగా.. కుటుంబం అప్పులు తీర్చాలని, గోల్డ్ మెడల్ సాధించాలని ప్లాన్.. చివరకు..
- కోల్కతా వైద్యురాలి ఆశలు సమాధి..
- కుటుంబ అప్పులు తీర్చి.. తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలని ప్లాన్..
- గోల్డ్ మెడల్ సాధించాలనుకుంది..
- ఆస్పత్రినే రెండో ఇల్లుగా భావించింది..చివరకు అక్కడే అఘాయిత్యానికి గురైంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో గత వారం 31 ఏళ్ల మహిళా డాక్టర్పై దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. ఈ కేసుని ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నైట్ డ్యూటీ చేసి, సెమినార్ హాలో నిద్రిస్తున్న సమయంలో ఆమెపై అఘాయిత్యం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఆమె శరీరంపై బట్టలు లేని స్థితిలో, ఒంటిపై గాయాలతో కనిపించింది. బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా డాక్టర్లు, సాధారణ ప్రజలు నిరసనలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, మరణించిన డాక్టర్ తన భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. పేదరికం నుంచి కష్టపడి డాక్టర్ అయింది. అయితే, ఆమె కలల్ని సంజయ్ రాయ్ అనే దుర్మార్గుడు చెరిపేశాడు. మరికొన్ని రోజుల్లో పీజీ పూర్తై, ఛెస్ట్ స్పెషలిస్టుగా ప్రజలకు సేవలు అందించాలను కుంది. గోల్డ్ మెడలిస్ట్ కావాలని ఆకాక్షించింది. అక్టోబర్లో జరిగే దుర్గాపూజ కోసం ఆమె ఎంతో ఉత్సాహంగా ఉందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
Read Also: Kolkata rape case: తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు!
ఇదిలా ఉంటే, కుటుంబ అప్పుల్ని తీర్చాలని ప్లాన్ కూడా చేసుకుంది. వారి తల్లిదండ్రుల జీవితాలను మెరుగుపరచాలని అనుకుంది. టైలరింగ్ దుకాణంలో పనిచేస్తూ ఆమె తల్లిదండ్రులు మెడిసిన్ చదివించారు. ‘‘మాది నిరుపేద కుటుంబం, ఆమెను ఎన్నో కష్టాలు పడి పెంచాం. ఆమె డాక్టర్ కావడానికి చాలా కష్టపడింది. మా కలలన్నీ ఒక్క రాత్రితో చెదిరిపోయాయని’’ వైద్యురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 2021 నుంచి మా ఇంటిలో దుర్గా పూజను చేస్తున్నాం, ఈ సారి ఈ పూజను మరింత పెద్దదిగా చేయాలని ఆమె భావించిందని తల్లి చెప్పింది.
తమ బిడ్డకు శాంతి కలగాలాంటే నిందితులను అరెస్ట్ చేసి, ఇందులో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరిని శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు. జేఈఈ, మెడికల్ ఎంట్రెస్ పరీక్షల్లో విజయం సాధించి, కళ్యాణిలోని జెఎన్ఎం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేసి, పీజీ చేసేందుకు రెండు ప్రభుత్వ వైద్యశాల్లలో అర్హత సాధించినట్లు బంధువులు వెల్లడించారు. ఘటన జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీని ఆమె తన ‘‘రెండో ఇల్లు’’గా పేర్కొంది. చదువుతో పాటు రోగులకు సేవలు అందిస్తూ అక్కడే సెమినార్ హాటులో నిద్రించేది. చివరకు అక్కడే ఘోరమైన అత్యాచారానికి, హత్యకు గురైంది.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!