కర్ణాటక అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ నోట ఆర్ఎస్ఎస్కు చెందిన గీతాన్ని ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై రకరకాలైన కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు స్వరం మారింది.. రేపు పార్టీ మారుతుందని కామెంట్లు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రభుత్వాలను జైలు నుంచి నడపడమేంటి?.. కొత్త బిల్లుపై మోడీ కీలక వ్యాఖ్యలు
ఆ మధ్య కాలంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వర్గాల మధ్య అధికార మార్పిడిపై ఫైటింగ్ జరిగింది. అధిష్టానం పెద్దలు అప్రమత్తమై చర్చలు కూడా నడిపారు. డీకే.శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తూనే.. భవిష్యత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని శివకుమార్ వర్గీయులు బహిరంగ ప్రకటనలు చేశారు. ఇక ఢిల్లీ వేదికగా కూడా చర్చలు నడిచాయి. ఇక చర్చలు ఎటు తెగకపోవడంతో డీకే.శివకుమార్ తన ఆవేదన వెళ్లగక్కారు. కొందరు పదవులను వదులుకోవడానికి ఇష్టపడరని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Putin: ఆ 3 కండీషన్స్ ఒప్పుకుంటేనే శాంతి చర్చలు.. తేల్చి చెప్పిన పుతిన్!
తాజాగా అసెంబ్లీ వేదికగా ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడంపై గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాకుండా గీతం ఆలపిస్తుండగా బీజేపీ నేతలు బల్లలు చరిచి అభినందించారు. చిరునవ్వులు చిందించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోవడం వంతైంది. అంటే ఏదో జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. డీకే.శివకుమార్.. బీజేపీ గూటికి చేరి వేరే కుంపటి పెట్టనున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.
చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటనకు శివకుమారే బాధ్యుడంటూ బీజేపీ సభ్యులు అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగళూరు ఇన్ఛార్జ్ మంత్రిగా, కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ సభ్యుడి హోదాలో ఆర్సీబీ జట్టును కేవలం ప్రొత్సహించడానికే వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. ప్లేయర్లను అభినందించి కప్‌ను ముద్దాడాక అక్కడితో తన పని అయిపోయిందని తనతోనే అన్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంలో శివకుమార్ ఆరెస్సెస్ గీతం “నమస్తే సదా వత్సలే మాతృభూమే…” పాడారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ జోక్యం చేసుకుని.. ‘‘ఈ లైన్లు రికార్డుల నుంచి తొలగించవద్దని ఆశిస్తున్నా’’ అని అన్నారు. దీంతో సభలో
నవ్వులు పూశాయి. 73 సెకన్ల నిడివి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
DK Shivakumar singing the RSS anthem in the House.
Maybe that’s his way of telling Siddaramaiah to vacate the chair before it’s too late.
Karnataka government looks on shaky ground 😂 pic.twitter.com/yAACBqMSao
— Meme Farmer (@craziestlazy) August 22, 2025
VIDEO | Karnataka Deputy CM DK Shivakumar (@DKShivakumar) recited the RSS’ Sangha Prarthana, ‘Namaste Sada Vatsale Matribhume’, while addressing the Assembly yesterday.
(Source: Third party)
(Full VIDEO available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/2CNsemZaq4
— Press Trust of India (@PTI_News) August 22, 2025