DK Shivakumar Interesting Comments on CM Post In Delhi: ‘కర్ణాటక సీఎం పీఠం ఎవరికి దక్కుతుంది?’ ఈ మిస్టరీని తేల్చేందుకు ఢిల్లీలోని హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై చర్చలు జరిపేందుకు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ని ఢిల్లీ పిలిపించారు. దీంతో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనని, సిద్ధరామయ్యని చెరో రెండేళ్లపాటు సీఎం పదవిని పంచుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిపాదించినట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు. అసలు అలాంటి ప్రతిపాదన తమ ముందుకు రాలేదన్న ఆయన.. ఇద్దరు కలిసి పంచుకోవడానికి సీఎం పదవి ఏమీ వారసత్వ ఆస్తి కాదని స్పష్టం చేశారు. అలాగే.. సిద్ధరామయ్యకు 80 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న వార్తలపై స్పందిస్తూ.. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 135 అని, దీన్ని ఎవరు విడగొట్టలేరని తేల్చి చెప్పారు. అసలు ఎమ్మెల్యేల మద్దతు గురించి అంత కచ్చితంగా సంఖ్య ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు.
New Zealand: న్యూజిలాండ్ హాస్టల్ భవనంలో అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి.. 11 మంది గల్లంతు
కాగా.. కర్ణాటక సీఎం విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా, అందుకు తాను కట్టుబడి ఉంటానని డీకే శివకుమార్ ఇదివరకే క్లారిటీ ఇచ్చేశారు. తాను ఎమ్మెల్యేలను విడగొట్టనని, వెన్నుపొటు అస్సలు పొడవనని, బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడనని తేల్చి చెప్పారు. చరిత్రలో తనపై ఎలాంటి మచ్చ ఉండకూడదని తాను కోరుకుంటున్నానని, చెడ్డపేరుతో వెళ్లాలని అనుకోవడం లేదని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తేవడమే తమ ముందున్న తదుపరి లక్ష్యమని తెలిపారు. మరోవైపు.. కర్ణాటక సీఎం ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మంగళవారం ఉదయం బేటీ అయ్యారు. ఢిల్లీ చేరుకున్న డీకేతోనూ కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరపనుంది. ఇద్దరితో చర్చలు జరిపిన అనంతరం.. సీఎం ఎవరనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం సిద్దరామయ్యవైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
Pawan Khera: డీకే, సిద్ధరామయ్యల మధ్య భేదాభిప్రాయాలు లేవు.. పవన్ ఖేరా స్పష్టత