Pawan Khera Clarity On DK Shivakumar Siddaramaiah Clash: కర్ణాటక సీఎం కుర్చీ విషయంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య నడుస్తున్న పంచాయితీపై ఏఐసీసీ మీడియా ఛైర్మన్ పవన్ ఖేరా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. అసలు కాంగ్రెస్‌లో నాయకుల మధ్య ఫైటింగ్ ఉండదని, కేవలం హెల్తీ కాంపిటీషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా కాంగ్రెస్ నాయకుల మధ్య ఉండే పోటీ.. పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీలోనే విభేదాలున్నాయని, అందులో 9 గ్రూపులు ఉన్నాయని చెప్పారు.
Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్‌ని కరిచిన కుక్క.. వీడియో వైరల్
కర్ణాటకలో తమ కాంగ్రెస్ పార్టీ చారిత్రక విజయం సాధించిందని పవన్ ఖేరా తెలిపారు. గత 9 సంవత్సరాలలో బీజేపీ నిత్యవసర సరుకుల ధరల్ని విపరీతంగా పెంచేసి, పేదలను ఇబ్బందుల్లో నెట్టిందని విమర్శించారు. ప్రధాని మోడీ ఎన్ని ర్యాలీలు చేసినా.. ప్రజలు మాత్రం ఆదరించలేదని కౌంటర్లు వేశారు. మోడీ ర్యాలీ చేసిన చోట కూడా బీజేపీని ఓడించారని చురకలంటించారు. టిప్పు సుల్తాన్ మొదలుకొని, కేరళ స్టోరీ లాంటివన్నీ బీజేపీ ప్రదర్శించిందని.. అయితే కర్ణాటక ప్రజలు ఆ పార్టీని ఓడించి, తగిన సమాధానం చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా కర్ణాటక ఫలితాలే రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీ స్కీమ్‌లు ఇచ్చామన్నారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. ఇచ్చిన హామీలను మొదటి క్యాబినెట్‌లోనే అమలు చేశామని గుర్తు చేశారు.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌ను పబ్లిక్‌లో ఉరితీయాలి.. ప్రతిపక్ష నేత సంచలన వ్యాఖ్యలు
బీజేపీ మాదిరిగా తమ కాంగ్రెస్ పార్టీలో సీఎంల ఎంపిక ఉండదని.. ఢిల్లీ నిర్ణయించదని పవన్ ఖేరా క్లారిటీ ఇచ్చారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తారని.. ఇప్పుడు కర్ణాటక ఎపిసోడ్‌లో అదే జరుగుతోందని వెల్లడించారు. అధిష్టానం అందరి అభిప్రాయాలను తీసుకుంటుందన్నారు. ఇంతకీ.. బీజేపీ ప్రతిపక్ష నేతను ఎన్నుకుందా? అందుకు ఇంకా ఎంత సమయం పడుతుంది? అని ప్రశ్నించారు. రాజస్థాన్‌లో కూడా తమ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.