Disha Salian Case: దిశా సాలియన్ ఆత్మహత్యకు తండ్రి ఎఫైర్ కారణమా..?
- దిశా సాలియన్ కేసులో సంచలనం..
- దిశా సూసైడ్‌కి తండ్రి ఎఫైర్ కారణమా..?
- కేసు క్లోజర్ రిపోర్టులో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disha Salian Case: దిశా సాలియన్ మృతి కేసు మరోసారి సంచలనంగా మారింది. ఐదేళ్ల క్రితం, ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ భవనం 14వ అంతస్తు నుంచి పడిపోయి చనిపోయింది. సెలబ్రిటీ మేనేజర్ అయిన దిశా, దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి కూడా పనిచేసింది. దిశా మరణించిన ఆరు రోజులకు సుశాంత్ తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు మరణాలపై అనేక పుకార్లు వచ్చాయి.
అయితే, ఇటీవల దిశా తండ్రి సతీష్ సాలియన్ తన కూతురు మృతి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కూతురి మరణంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే హస్తం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ముంబై పోలీసులు ఆదిత్య ఠాక్రే, రియా చక్రవర్తితో సహా 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్‌చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్‌లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్‌లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
Read Also: CM Chandrababu: ఆ ఆలోచన విరమించండి.. జనాభా పెంపుపై దృష్టి పెట్టండి.. ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. దిశా సాలియన్ కేసు క్లోజర్ రిపోర్టులో సంచలన విషయాలు తెలిశాయి. ఆమె తండ్రి సతీష్ సాలియన్ ఆర్థిక ద్రోహం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. పలు ప్రాజెక్టులు ఫెయిల్యూర్ కావడం, స్నేహితులతో అపార్థాలతో పాటు, దిశా తండ్రి ఆమె కష్టపడి సంపాదించిన డబ్బును థానేలోని తన సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్లో తనతో సంబంధం ఉన్న మహిళా ఉద్యోగి కోసం ఖర్చు చేయడం ద్వారా దుర్వినియోగం చేసినట్లు క్లోజర్ రిపోర్ట్ పేర్కొంది.
నివేదికల ప్రకారం, వ్యాపారం, కుటుంబ సమస్యల కారణంగా దిశా సాలియన్ ఒత్తిడికి గురవుతున్నట్లు అందరూ చెప్పారని, ఆమె కార్నర్‌స్టోన్ కంపెనీలో సెలబ్రిటీ మేనేజర్‌గా పనిచేసేది, ఆమె నిర్వహిస్తున్న ప్రాజెక్టులు ఆగిపోయవడం ఆమెను మరింత బాధపెట్టినట్లు తెలుస్తోంది. దిశ స్నేహితులతో పాటు ఆమెకు కాబోయే భర్త రాయ్ కూడా పోలీస్ వాంగ్మూలంలో ఆమె తండ్రి వ్యవహారం, ఆమె వ్యాపారం కోసం ఇచ్చిన డబ్బును వేరే మహిళకు ఖర్చు చేసినట్లు చెప్పారు. దిశా మరణంపై అనుమానాల నేపథ్యంలో, ఆమె తలకు బలమైన గాయం కావడంతో మరనించినట్లు నివేదిక చెప్పింది.
తాజావార్తలు
-
Donald Trump: ట్రంప్ మైండ్‌లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్‌గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!