Disha Salian Case: దిశా సాలియన్ మృతి కేసు మరోసారి సంచలనంగా మారింది. ఐదేళ్ల క్రితం, ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ భవనం 14వ అంతస్తు నుంచి పడిపోయి చనిపోయింది. సెలబ్రిటీ మేనేజర్ అయిన దిశా, దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి కూడా పనిచేసింది. దిశా మరణించిన ఆరు రోజులకు సుశాంత్ తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు మరణాలపై అనేక పుకార్లు వచ్చాయి.