Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్‌బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- పాకిస్తాన్లో ధురంధర్ 2 క్రేజ్..
- దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్..
- బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్‌బస్టర్‌గా ధురంధర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: స్పై, యాక్షన్ సినిమాగా వచ్చిన ‘‘ధురంధర్: ది రివెంజ్’’ బాలీవుడ్‌తో పాటు భారత చలనచిత్ర రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. రణ్వీర్ సింగ్ యాక్షన్ ఈ సినిమాకే హైలెట్‌గా మారింది. దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. పాకిస్తాన్లో టెర్రర్ నెట్‌వర్క్‌లోకి వళ్లే భారత గూఢచారి పాత్రలో రణ్వీర్ నటన అందర్ని ఆకట్టుకుంది. ఈ సినిమా భారతదేశంలో సంచలనాలను సృష్టించింది.
ఇదిలా ఉంటే, ధురంధర్ సినిమాను పాకిస్తాన్ బ్యాన్ చేసింది. ఏ దేశమైతే బ్యాన్ చేసిందో, ఇప్పుడు ఆ దేశంలోనే సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ధురంధర్ 2 ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని పాక్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇలా ఓటీటీలో రిలీజ్ అయిన వెంటనే పాకిస్తాన్లో నెంబర్1గా ధురంధర్ 2 ట్రెండ్ అవుతోంది. ఈ ట్రాఫిక్ ధాటికి ఏకంగా నెట్ఫ్లిక్ సర్వర్లు క్రాష్ అయినట్లు పాకిస్తాన్ కంటెంట్ క్రియేటర్లు చెబుతున్నారు.
Also Read
- Hafiz Saeed: పహల్గామ్ ఉగ్రదాడి.. హఫీజ్ సయీద్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్..
- Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?
- E20 Petrol: E20 పెట్రోల్‌పై కేంద్రానికి షాక్.. 53% NDA ఓటర్లు వ్యతిరేకం..
- Modi-Ketan Agarwal: ప్రధాని, రాష్ట్రపతికి కేతన్ అగర్వాల్ కుటుంబం లేఖ.. ఏముందంటే..!
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో.. కంటెంట్ క్రియేటర్ మావియా ఉమర్ ఫరూకీ మాట్లాడుతూ..‘‘”పాకిస్తాన్లో ‘ధురంధర్’ ఈరోజే విడుదలైంది, వెంటనే సర్వర్ క్రాష్ అయ్యింది. రాత్రి 12 గంటలకు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా ఎప్పుడు వస్తుందా, అందరూ కలిసి ఒకేసారి ఎప్పుడు క్లిక్ చేద్దామా అని పాకిస్తానీలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ ‘ధురంధర్’ పట్ల ప్రజల్లో అంతటి అభిమానం, క్రేజ్ కనిపిస్తోంది’’ అని చెప్పాడు. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ధురంధర్2ను ‘‘రా అండ్ అన్‌కట్’’ వెర్షన్‌ను అంతర్జాతీయంగా విడుదల చేసింది.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో, ‘ధురందర్’ డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కాగా, ‘ధురందర్ 2’ ఈ ఏడాది మార్చి 19న విడుదలైంది. ఇండియాలో జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఈ సినిమా జూన్ 4న రానుంది. భారత్‌లో చాలా మంది ఈ సినిమాను థియేటర్లలో చూశారు. ఇప్పుడు దాయాది దేశం పాకిస్తాన్లో ఈ సినిమాపై క్రేజ్ ఆకాశాన్ని చేరింది.
తాజావార్తలు
-
Kajal Aggarwal: కెరీర్లో బికినీ వేయకపోవడంపై కాజల్ సంచలన వ్యాఖ్యలు!
-
IND vs ENG 1st ODI: సీనియర్ల రీఎంట్రీతో ఆసక్తికర పోరు.. భారత తుది జట్టు ఇదే..
-
Hafiz Saeed: పహల్గామ్ ఉగ్రదాడి.. హఫీజ్ సయీద్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్..
-
Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
-
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!