Dhruv Rathee: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు బిభవ్‌ని అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని, నిందితుడి మొబైల్ ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాథీ, స్వాతి మలివాల్‌ని ఉద్దేశించి చేసిన వీడియోపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలని నిందితుడిగా పేర్కొంటున్నాడని, ఈ వీడియో తర్వాత తనకు అత్యాచారం, హత్య బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆమె ఆరోపించారు.
Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్పీ భుజంగరావు వాగ్మూలంలో సంచలన విషయాలు
ఈ ఆరోపణల అనంతరం ధృవ్ రాథీ స్పందించారు. స్వాతి మలివాల్ పేరును తీసుకోకుండా ట్వీట్ చేశారు. ‘‘నాపై బూటకపు ఆరోపణలు, రోజురోజుకు చంపేస్తామని బెదిరింపులు, అమానవీయ దూషణలు, నా పరువు తీసేందుకు సమన్వయంతో ప్రచారాలు.. నాకు ఇప్పటికే అలవాటైపోయాయి. విడ్డూరం ఏంటంటే.. నిందితులు బాధితులుగా నటిస్తున్నారు. వీటన్నింటి వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. నన్ను నిశ్శబ్ధం చేయాలని చూస్తు్న్నారు. కానీ అది జరగదు. మీరు ఒక్క ధృవ్ రాథీని సైలెంట్ చేస్తే , 1000 మంది కొత్తవారు వస్తారు’’ అని ఎక్స్ వేదికగా ట్వీట చేశారు.
ఆదివారం స్వాతిమలివాల్ ధృవ్ రాథీపై ఆరోపణలు గుప్పించారు. ఆప్ నాయకులు తన క్యారెక్టర్‌ని హత్య చేస్తున్నారని, అత్యాచారం-హత్య బెదిరింపులు వస్తున్నాయని, ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాథీ ఏకపక్షంగా వీడియో పెట్టడంతో ఈ పరిస్థితి మరింత తీవ్రమైందని ఆమె ఆరోపించారు. స్వతంత్ర జర్నలిస్టు అని చెప్పుకునే కొందరు ఆప్ అధికార ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారని ధృవ్ రాథీని ఉద్దేశించి అన్నారు.
Fake allegations against me, daily death threats, dehumanizing insults, coordinated campaigns to defame me … I’m used to it by now.
The irony is that perpetrators are pretending to be victims. Everyone knows who is behind all this. They want to silence me.
But that’s not…
— Dhruv Rathee (@dhruv_rathee) May 27, 2024