Crime news: బెంగూరులో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రభుత్వ అధికారిని హత్య చేశారు. వివరాలలోకి వెళ్తే.. ప్రతిమ(37) అనే మహిళ బెంగళూరులో మైన్స్ అండ్ ఎర్త్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆమె బెంగళూరు లోని సుబ్రహ్మణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని దొడ్కకలసంద్ర లోని గోకుల అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. కాగా శనివారం రాత్రి దాదాపు 8 గంటల ప్రాంతంలో కార్ డ్రైవర్ ప్రతిమను కార్యాలయం నుండి ఇంటికి తీసుకు వచ్చి దింపాడు. అనంతరం డ్రైవర్ కూడా వెళ్లిపోయారు. ప్రతిమ ఒక్కరే ఇంట్లో ఉండగా అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ప్రతిమను హత్య చేశారు.
Read also:Israel Attack: పాలస్తీనియన్ల హత్యకు నిరసనగా ఇజ్రాయెల్లో తన రాయబారిని వెనక్కి పిలిచిన టర్కీ
ప్రతిమ సోదరుడు ఎన్ని సార్లు ఫోన్ చేసిన ప్రతిమ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రతిమ సోదరుడు ఈ రోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా ప్రతిమ రక్తం మడుగులో విగతజీవిగా పడివుంది. దీనితో ఈ ఘటన వెలుగు చూసింది. కాగా సౌత్ డివిజన్ డీసీపీ రాహుల్ కుమార్ షాపూర్వాడ్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎలాంటి ఆధారాలు కనిపించ లేదు. దీనితో తెలిసిన వారే పగడ్బందీగా హత్య చేసి ఉంటారని అనుమానం రావడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రతిమ కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్నారు. భర్త, కొడుకు భర్త, కొడుకు తీర్థహళ్లిలో నివాసముంటున్నట్లు సమాచారం.