Deputy CM Pawan Kalyan: సనాతనాన్ని రక్షించడానికే శివసేన-జనసేన.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం..
- శివాజీ మహరాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉంది..
- జాతీయ భావం, ప్రాంతీయ తత్వం మా పార్టీల సిద్ధాంతం..
- శివసేన-జనసేన సనాతనాన్ని రక్షించడానికే ఆవిర్భవించాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.. మహాయుతి కూటమి తరపున.. బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే పార్టీ), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు.. ఈ రోజు మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో మొదట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.. జాతీయ భావం, ప్రాంతీయ తత్వం మా పార్టీల సిద్ధాంతంగా చెప్పుకొచ్చారు.. బాలా సాహెబ్ ఠాక్రే (బాల్ ఠాక్రే) నుంచి తాను ఎంతో నేర్చుకున్నాను.. శివసేన-జనసేన సనాతనాన్ని రక్షించడానికే ఆవిర్భవించాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇక, శివసేన-జనసేన అన్యాయంపై పోరాడతాయన్నారు.. ధైర్యం, పౌరుషంతో కూడిన భారత్‌ను బాలాసాహెబ్ కోరుకున్నారని గుర్తుచేశారు.. బాలాసాహెబ్ కలలు కన్న అయోధ్య రామమందిరాన్ని నిర్మించి చూపించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ప్రశంసలు కురిపించారు..
Read Also: Nayanthara Dhanush: హీరో ధనుష్ పై నయనతార సంచలన విమర్శలు.. నువ్వేంటో ఇప్పుడు తెలుస్తుంది
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం అన్నారు పవన్ కల్యాణ్.. అయితే, ఇప్పుడు దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతిలో ఉంది.. వీడిపోయి బలహీనపడదామా?.. లేదా కలిసి బలంగా నిలబడదామా?.. వీడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా? లేదా కలిసి బంగారు భవిష్యత్‌ను నిర్మించుకుందామా?.. విడిపోయి అరాచకత్వానికి స్థానం కల్పిద్దామా? లేక కలిసి అభివృద్ధి.. సంక్షేమం వైపు నడిపిద్దామా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. అయితే, మనం అందరం బాధ్యత గల పౌరులం.. ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!