Dengue Vaccine: దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ ఫీవర్‌కు ఇకపై చెక్ పడనుంది. 2026 జనవరి నాటికి డెంగ్యూ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక దశ ప్రయోగాలు ముగిశాయని.. వాటిలో ఎటువంటి ప్రతికూల ఫలితాలు రాలేదని పరీక్షలను నిర్వహించిన సంస్థలు తెలిపాయి. ఇండియాకు చెందిన సంస్థతోపాటు మరో రెండు సంస్థలు కూడా డెంగ్యూ వ్యాక్సిన్ తయారీకి సిద్ధమయ్యాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధి డెంగ్యూ. ఇది గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై 31 మధ్య కాలంలో 31,464 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. వాటి ద్వారా 36మరణాలు నమోదయ్యాయి.
Read Also: Ganja Selling: వీళ్లు అత్తాకోడళ్ళా.. యవ్వారం మమూలుగా లేదుగా..!
డెంగ్యూ వ్యాక్సిన్ తయారీదారు అయిన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) తన డెంగ్యూ ఫీవర్ వ్యాక్సిన్‌ను 2026 ప్రారంభంలో వాణిజ్యపరంగా విడుదల చేయాలని సంస్థ భావిస్తోంది. దేశంలోనే డెంగ్యూ వ్యాక్సిన్ తయారీకి సంస్థలు పోటీపడుతున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో దాని వ్యాప్తి పడిపోయినప్పటికీ, 2020 నుండి 2021 వరకు 333 శాతం పెరుగుదల ఉందని.. అలాగే 2021 మరియు 2022 మధ్య కేసుల సంఖ్య 21 పెరిగిందని నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రకటించింది. IIL మేనేజింగ్ డైరెక్టర్ K. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ దేశంలో 18-50 సంవత్సరాల వయస్సు గల 90 మంది వ్యక్తులపై నిర్వహించిన టీకా యొక్క ప్రారంభ దశ ట్రయల్స్ ఎటువంటి ప్రతికూల ప్రభావాలను ప్రదర్శించలేదని తెలిపారు. “మేము ఫేజ్ 1 ట్రయల్స్‌ను పూర్తి చేయబోతున్నాము మరియు తదుపరి స్థాయికి వెళ్తాము. వీటన్నింటికీ కనీసం రెండు నుండి మూడు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వ్యాక్సిన్‌ను జనవరి 2026లో మార్కెట్‌లోకి తీసుకురావాలని చూస్తున్నామని కుమార్ చెప్పారు. ప్రారంభ-దశ ట్రయల్స్ భద్రతా కారకం మరియు సామర్థ్యాన్ని కొంత మేరకు నిర్ణయించడం జరిగిందన్నారు. IILతో పాటు మరో రెండు భారతీయ కంపెనీలు – సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు పనేసియా బయోటెక్ కూడా డెంగ్యూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయి.