Delhi Red Alert: ఢిల్లీని హడలెత్తిస్తోన్న ఉష్ణోగ్రతలు.. 52 డిగ్రీలు నమోదు
- ఢిల్లీని హడలెత్తిస్తోన్న ఉష్ణోగ్రతలు
- 52 డిగ్రీలు నమోదు
- బయటకు వెళ్లొద్దని ఆరోగ్య శాఖ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించి చాలా రోజులైంది. అలాగే జూన్ మాసం కూడా సగం రోజులైపోతుంది. కానీ ఉష్ణోగ్రతల్లో మాత్రం మార్పు రాలేదు. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతుంటే.. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తీవ్ర వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భానుడు భగభగ మండిపోతున్నాడు. ఢిల్లీలో ప్రస్తుతం 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఢిల్లీ, పంజాబ్‌లో కేంద్ర వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పగలు ఎండలు ఎక్కువగా ఉంటాయని.. సాయంత్రం మాత్రం ఉపశమనం లభించొచ్చని ఐఎండీ తెలిపింది. అంతేకాకుండా సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Gopichand 33: గోపీచంద్ – సంకల్ప్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ విడుదల..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
వేడిగాలులతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది. చిన్న పిల్లలు, వృద్ధులు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితులైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Lok Sabha Elections: నారీమణులకు కేంద్రం గుడ్‌న్యూస్..! వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో..!
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ వారంలో ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్ 20 నాటికి హిమాచల్ ప్రదేశ్‌కు, జూన్ 27 నాటికి పంజాబ్‌కు రుతుపవనాలు చేరుకుంటాయని అంచనా వేసింది.
ఇక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున మధ్యాహ్నం సమయంలో ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, కఠినమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, నీరు ఎక్కువగా తాగాలని, తలతిరగడం, అలసట, గుండె కొట్టుకోవడం వంటి వడదెబ్బ లక్షణాల కోసం జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య అధికారులు ప్రజలను కోరారు.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!