టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం ఓ విభిన్న కథతో రాబోతున్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో 33వ ప్రాజెక్ట్ కావడంతో దీనిని ‘#Gopichand33’గా ట్యాగ్ చేస్తున్నారు. ‘ఘాజీ’ వంటి చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్, ఇప్పుడు గోపిచంద్‌తో కలిసి ఈ స్పెషల్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా (జూన్ 12) తాజాగా ఈ చిత్రం నుండి ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వీడియో అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. గ్లింప్స్‌లో గోపిచంద్ సరికొత్త గెటప్‌తో కనిపించడంతో పాటు సినిమాలో సాంకేతికతకు ప్రాధాన్యతను హైలైట్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంట్రస్టింగ్ గా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గోపీచంద్ లుక్ మొత్తం మార్చేశాడు.
Also Read : A.A. Arts Mahendra : సీనియర్ నిర్మాత ఎ .ఎ. ఆర్ట్స్ మహేంద్ర కన్నుమూత
ఇక ఈ సినిమా ఒక స్పెషల్ మిషన్ నేపథ్యంతో సాగుతుందన్న టాక్ ఉంది. గోపిచంద్ ఇందులో ఓ కమాండో రోల్‌లో నటిస్తున్నారని సమాచారం. ఇంటర్నేషనల్ లెవెల్‌లో మిషన్స్, హై టెక్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో కీలకంగా ఉండబోతున్నాయి. సంకల్ప్ రెడ్డి స్టైల్‌కు తగ్గట్టుగా ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొత్తంగా చూస్తే ఈ మూవీ మొదటి గ్లింప్స్‌తోనే ప్రేక్షకులలో భారీ హైప్ క్రియేట్ చేసింది. గోపీచంద్ మరోసారి తన యాక్షన్ మేనరిజంతో థ్రిల్ కలిగించబోతున్నాడన్న నమ్మకాన్ని ఈ వీడియో కలిగించింది. త్వరలో టీజర్, ట్రైలర్‌ల ద్వారా మిగిలిన అప్‌డేట్స్ రానున్నాయి.