VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీవో సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్లయిన ‘వీవో V80’, ‘వీవో S2 FE’లను అక్టోబర్ 6న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ రెండు ఫోన్లను అమెజాన్, ఫ్లిప్ కార్ట్, వీవో అధికారిక వెబ్సైట్ అలాగే ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. సన్‌రైజ్ ఆంథమ్, హోరిజోన్ బ్లూ, స్టెల్లర్ బ్లాక్ కలర్స్‌లో రానున్న వీవో V80 అద్భుతమైన ఫీచర్లతో వస్తోంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.59-అంగుళాల 1.5K OLED డిస్ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 7 తో పనిచేసే ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అలాగే ఇందులో V-సిరీస్‌లోనే అత్యంత భారీ అయిన 7000mAh బ్యాటరీని 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇచ్చారు.
కెమెరా పరంగా వీవో V80 లో జైస్ (Zeiss) బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50-మెగాపిక్సెల్ సోనీ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ నైట్ టెలిఫోటో కెమెరా (100x జూమ్ సపోర్ట్‌తో), వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. ముందువైపు ఆటోఫోకస్ కలిగిన 50-మెగాపిక్సెల్ గ్రూప్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.
Also Read
- Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
- AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
- Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
ఇక ఇదే రోజు లాంచ్ కానున్న మరో ఫోన్ ‘వీవో S2 FE’ ఫ్లిప్‌కార్ట్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఇది గ్రీన్ ఫినిష్, ఫ్లాట్ డిజైన్‌తో వస్తోంది. దీని అంచనా ధర సుమారు రూ. 39,999 వరకు ఉండవచ్చు. ఈ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.83-అంగుళాల 1.5K అమోలెడ్ ఫ్లాట్ డిస్ప్లేను ఇచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300e 5G చిప్సెట్తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ 10,000mAh బ్యాటరీ కావడం విశేషం. ఫోన్ మన్నిక కోసం IP68, IP69 రేటింగ్‌లతో పాటు వెనుకభాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న ఈ రెండు కొత్త వీవో ఫోన్లు టెక్ మార్కెట్లో భారీ అంచనాలను సృష్టిస్తున్నాయి.
తాజావార్తలు
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!