ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు లేఖ రాయడం సంచలనంగా మారింది. యమునా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని రేఖా గుప్తా కోరారు. ఇసుక అక్రమ తవ్వకాలతో ఢిల్లీకి ప్రమాదం పొంచి ఉందని.. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరు బీజేపీ ముఖ్యమంత్రుల మధ్య లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇది అంతర్ రాష్ట్ర సమస్యగా రేఖా గుప్తా లేఖలో పేర్కొనడం విశేషం. ఈ సందర్భంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆందోళనలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తెలియజేశారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లకపోతే భవిష్యత్‌లో రాజధాని ప్రజలకు ముప్పు పొంచి ఉంటుందని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: KTR: సీఎం వేస్తారేమో అనుకున్నాం.. ఢిల్లీకి వెళ్లారు.. డిప్యూటీ సీఎం, వ్యవసాయ మంత్రి ఎవరైనా రండి చర్చిద్దాం
మైనింగ్ కార్యకలాపాలు కారణంగా నది బలహీనంగా మారుతుందని.. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి వరదల ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. అంతేకాకుండా తవ్వకాలు కారణంగా సహజ మార్గాన్ని కూడా మారుస్తాయని చెప్పారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తీవ్ర ప్రభావం చూపుతుందని రేఖా గుప్తా గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Bathukamma Kunta : బతుకమ్మ కుంట బతికింది.. ఎంత బాగుందో ఇప్పుడు..
అక్రమ తవ్వకాలు అంతర్-రాష్ట్ర సమస్యగా రేఖా గుప్తా తెలిపారు. రెండు ప్రభుత్వాల మధ్య ఉమ్మడి చర్యలు అవసరమని వివరించారు. దీనిపై ఢిల్లీ, యూపీ ప్రభుత్వాల మధ్య సమన్వయ చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. స్పష్టమైన సరిహద్దులు లేకపోవడం వల్లే పర్యవేక్షణ చర్యలు క్లిష్టతరంగా మారినట్టు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం సహకార విధానాన్ని కోరుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి యూపీ పరిపాలనా సమన్వయాన్ని ప్రారంభించాలని రేఖా గుప్తా అభ్యర్థించారు. దీనిపై యోగి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. సానుకూలంగా స్పందిస్తుందో.. లేదంటే తోసిపుచ్చుతుందో చూడాలి.