దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 17న నామినేషన్లకు చివరి తేదీ. 13000 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు పేర్కొంది.
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా అందులో 58 జనరల్ స్థానాలు ఉన్నాయి. మరో 12 ఎస్సీ స్థానాలు ఉన్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం 1.55 కోట్ల ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 83. 49 లక్షలు, మహిళలు 71. 74 లక్షలు ఉండగా.. యువ ఓటర్లు 25.89 వేల మంది ఉండగా.. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు 2.08 లక్షలు, వికలాంగులు 79, 436 మంది, వయోవృద్ధులు 830, ట్రాన్స్ జెండర్స్ 1261 మంది ఉన్నారని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.