గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బాబీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఇక చిన్ని అంటూ వచ్చిన సెకండ్ సాంగ్ ఎమోషనల్ టచ్‌తో సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అసలు బాలయ్య అంటేనే ఊగిపోయే తమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్ బాక్సులు బద్దలు చేయడం గ్యారెంటీ అని నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.
Also Read : Nayanthara : నయన్ కు నోటీసులు.. ఖండించిన నిర్మాత
కాగా ఇప్పటి వరకు ఈ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా చేస్తూ వచ్చారు. ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం డాకు మహారాజ్ ను తమిళ్ తో పాటుగా హిందీలోను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారట. దానికి సంబంధించి డబ్బింగ్ పనులు కూడా మొదలెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక నెల 9న అనంతపురంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళ్, హిందీలో అడుగుపెడుతున్న డాకు మహారాజ్ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.