Modi-Putin: తీవ్ర ఆవేదన చెందా.. పుతిన్ నివాసంపై దాడిని ఖండించిన మోడీ
- పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు
- దాడిని ఖండించిన మోడీ
- తీవ్ర ఆవేదన చెందినట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చిగురిస్తున్న వేళ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు తీవ్ర కలకలం రేపాయి. సోమవారం అర్ధరాత్రి పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు జరిగాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. రష్యా రక్షణ వ్యవస్థలు 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని, ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. శాంతి ఒప్పందాన్ని అడ్డుకునేందుకు రష్యా అబద్ధాలు చెబుతోందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.
మోడీ ఖండన..
పుతిన్ నివాసంపై దాడిని ప్రధాని మోడీ ఖండించారు. డ్రోన్ దాడుల వార్తలు తెలియగానే ‘తీవ్ర ఆందోళన’ చెందినట్లుగా తెలిపారు. ప్రపంచ నాయకులు సంయమనం పాటించాలని.. శాంతి కోసం దౌత్య ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని కోరారు.
Also Read
ట్రంప్..
ఇదే విషయంపై ట్రంప్ కూడా స్పందించారు. పుతిన్ నివాసంపై దాడి వార్తలు తెలియగానే పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేసి విషయాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ఇలా జరగడం మంచిది కాదన్నారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా ఇలా జరగడం భావ్యం కాదన్నారు. పుతిన్ నుంచి విషయం తెలుసుకోగానే.. చాలా కోపంగా ఉన్నట్లు చెప్పారు.
షెహబాజ్ షరీఫ్
ఇక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా పుతిన్ నివాసంపై దాడిని ఖండించారు. శాంతి భద్రతలకు ముప్పు కలిగించే అన్ని రకాల హింసలను పాకిస్థాన్ తిరస్కరిస్తుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి హేయమైన చర్య శాంతి, భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని చెప్పారు. రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు పాకిస్థాన్ సంఘీభావాన్ని తెలిపింది.
Deeply concerned by reports of the targeting of the residence of the President of the Russian Federation. Ongoing diplomatic efforts offer the most viable path toward ending hostilities and achieving peace. We urge all concerned to remain focused on these efforts and to avoid any…
— Narendra Modi (@narendramodi) December 30, 2025
తాజావార్తలు
-
Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!