రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడి అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందంటూ ఇటీవల రష్యా సైనిక అధికారులు.. అమెరికాకు ఆధారాలు సమర్పించింది. తాజాగా ఇదే అంశంపై ఆదివారం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ స్పందించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు సఫలీకృతం అవుతున్న తరుణంలో ఉక్రెయిన్ తీరు ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై భారీ డ్రోన్లు దాడి చేశాయి. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చిగురిస్తున్న వేళ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు తీవ్ర కలకలం రేపాయి. సోమవారం అర్ధరాత్రి పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు జరిగాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది.