కరోనా థర్డ్ వేవ్ మొదలైందని చెప్పడానికి కేసుల పెరుగుదలే ఓ ఉదాహరణ. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,265 కరోనా కేసులు నమోదవ్వగా, 13 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 8,907 మంది కోలుకున్నారు. ఇక రాజధాని ముంబైలో కొత్తగా 20,181 కేసులు నమోదవ్వగా, 4 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,14,847 యాక్టివ్ కేసులు ఉండగా, ఒక్క ముంబై నగరంలోనే 79,260 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
Read: బిగ్ బ్రేకింగ్: మహేష్ బాబుకు కరోనా
మహారాష్ట్రలో కొత్తగా 79 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 876 కేసులు నమోదయ్యాయి. ఇందులో 381 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. సెకండ్ వేవ్ మహారాష్ట్రపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మూడో వేవ్ కూడా మహారాష్ట్రపై భారీ ప్రభావం చూపుతున్నది. పాజిటివిటీ రేటు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. నిబంధలను కఠినంగా అమలుచేస్తున్నారు. అయినప్పటికీ కేసులు భారీగా పెరుగుతున్నాయి.