బిగ్ బ్రేకింగ్: మహేష్ బాబుకు కరోనా

చిత్ర పరిశ్రమలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు.

” నా ప్రియమైన అభిమానులకు.. శ్రేయోభిలాషులకు.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేను కరోనా బారిన పడ్డాను. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఇంట్లోనే ఐసోలేషన్ లో వైద్యుల సూచనలతో చికిత్స తీసుకుంటున్నాను. దయచేసి ఇటీవల నన్ను కలిసినవారందరు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోండి. అది కరోనా తీవ్రత నుంచి హాస్పిటల్ వరకు వెళ్లకుండా కొద్దిగా అయినా తప్పిస్తుంది. దయచేసి అందరు కరోనా నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి.. మళ్లీ తిరిగి రావడానికి వేచి ఉండలేను” అంటూ ట్వీట్ చేశారు. ఇక మహేష్ కి కరోనా రావడంతో ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు.

Related Articles

Latest Articles