PM Modi: “ప్రధాని మోడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి”.. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ని ఉల్లంఘించారని, ఆయన ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌ని హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ పిటిషన్ ‘పూర్తిగా తప్పుగా భావించబడింది’ అని పేర్కొంది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ప్రధానిపై ఆరేళ్లు అనర్హత వేటు వేయాలని న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాలే పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Konda Visveshwar Reddy: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి..
Also Read
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ఈ కేసును జస్టిస్ సచిన్ దత్తాలో కూడిన సింగిల్ జడ్జ్ బెంజ్ విచారించింది. ఏ ఫిర్యాదుపైనా ప్రత్యేక చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు మార్గనిర్దేశం చేయలేదని పేర్కొంది. పిటిషనర్ ఇప్పటికే దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని, ఎన్నికల సంఘం దీనిపై స్వతంత్ర అభిప్రాయాన్ని తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఫిర్యాదును సక్రమంగా విచారించి ఉత్తర్వులు జారీ చేస్తామని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది సిద్ధాంత్కుమార్ పేర్కొన్నారని కూడా పేర్కొంది.
ఏప్రిల్ 9న యూపీలోని పిలిభిత్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ హిందూ, సిక్కు దేవతల్ని ప్రస్తావించారని పిటిషనర్ ఆనంద్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఇండియా కూటమి పార్టీలు ఎప్పుడూ అసహ్యించుకుంటున్నాయని ప్రధాని తన ప్రసంగంలో అన్నారు. ‘‘వారు రామాలయం యొక్క ‘ప్రాణ ప్రతిష్ఠ’ ఆహ్వానాన్ని తిరస్కరించారు మరియు రామ్ లల్లాను అవమానించారు. వేడుకకు హాజరైన ఆ పార్టీకి చెందిన వారిని ఆరేళ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేశారు’’ అని ప్రధాని అన్నారు. ఇండియా బ్లాక్ శక్తిని అంతం చేయాలని చెబుతోందని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా శక్తిని ఆరాధించే వారెవరూ కాంగ్రెస్‌ని క్షమించరని అన్నారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!