Congress: సంజయ్ నిరుపమ్‌ని బహిష్కరించనున్న కాంగ్రెస్.. ఠాక్రేపై వ్యాఖ్యలే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్‌ని బహిష్కరించేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఇండియా కూటమిపై సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయన వైఖరిపై కాంగ్రెస్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడిని కాంగ్రెస్ నుంచి బహిష్కరించేందుకు మహారాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే ప్రతిపాదనల్ని హైకమాండ్‌కి పంపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ల లిస్టు నుంచి ఇప్పటికే నిరుపమ్‌ని తొలగించింది. అతడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఇటీవల మహా కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అన్నారు. మాజీ ఎంపీ అయిన నిరుపమ్, ఉద్ధవ్ ఠాక్రే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: JP Nadda: ‘‘సగం మంది జైలులో, సగం మంది బెయిల్‌లో’’.. ఇండియా కూటమిపై నడ్డా ఫైర్..
Also Read
- Parliament Session: పార్లమెంట్లో నేడు కీలక బిల్లులు.. పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లుపై చర్చ.!
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
వివాదం ఏమిటి.?
ముంబాయ్ నార్త్-వెస్ట్ సీటు నుంచి నిరుపమ్ పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం అమోల్ కీర్తికర్‌ని ఆ స్థానంలో నిలబెట్టారు. 2019లో శివసేన నేత గజానన్ కీర్తీకర్ చేతిలో నిరుపమ్ ఓడిపోయారు. ప్రస్తుతం గజానన్ ఏక్ నాథ్ షిండే పక్షాన ఉన్నారు. మరోవైపు పొత్తులో భాగంగా ఏక్‌నాథ్ షిండే ఈ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని భావిస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ పరిణామాల గురించి నిరుపమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతు లేకుండా ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఏ సీటును గెలుచుకోలేదని అన్నారు. కోవిడ్ సమయంలో ఖిడ్డీ స్కామ్‌లో వలస కార్మికులకు ఉచిత ఆహారం అందిచే కార్యక్రమంలో అమోల్ కీర్తికర్ లంచాలు తీసుకున్నట్లు ఆయన ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే నిరుపమ్ పార్టీ మారుతున్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే నిరుపమ్ మా పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే అన్నారు. మరోవైపు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూడా నిరుపమ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
CAT 2026 Notification: IIMల్లో MBA చదవాలనుకునే వారికి అలర్ట్.. CAT 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
-
Polimera 3: ‘పొలిమేర 3’ నుంచి అదిరే అప్డేట్.. కీలక పాత్రలో బ్లాస్ట్ స్టార్ అర్జున్
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Varanasi: మహేష్ ‘వారణాసి’కి కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్.. సెప్టెంబర్ నుంచి అసలు పని!
-
Vivo X300e: వివో X300e విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!