JP Nadda: ‘‘సగం మంది జైలులో, సగం మంది బెయిల్‌లో’’.. ఇండియా కూటమిపై నడ్డా ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: ప్రతిపక్ష ఇండియా కూటమిని టార్గెట్ చేసుకుంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. ఇండియా కూటమి ‘వంశపారంపర్య పార్టీల’ కూటమిగా అభివర్ణించారు. ఈ కూటమిలోని సగం మంది నాయకులు జైల్లో ఉంటే, మరో సగం మంది బెయిల్‌పై ఉన్నారని అన్నారు. ఈ రోజు రాజస్థాన్ ఝాలావర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా అలయన్స్ అనేది అవినీతి రక్షణ కూటమి అని అన్నారు. ఆ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలే అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అన్ని చోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ‘‘రాహుల్ గాంధీ బెయిల్‌పై వచ్చారా..? లేదా..?, సోనియాగాంధీ, చిదంబర్, సంజయ్ సింగ్ బెయిల్‌పై బయట ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారా..? లేదా..?’’ అని ఆయన ప్రశ్నించారు. ఇండియా కూటమిలో సగం నేతలు జైలులో ఉంటే, సగం మంది బెయిల్‌పై బయట ఉన్నారు.
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
Read Also: Summer Heatwave: ఈ వేసవి చాలా హాట్ గురూ.. దేశవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు..
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో భారత్ వేగంగా పురోగమిస్తోందని నడ్డా ప్రశంసించారు. ఈ రోజు దేశంలో అవినీతి రహిత ప్రభుత్వం ఉందని చెప్పారు. మోడీ నాయకత్వంలో గ్రామాల పరిస్థితి మారిపోయిందని ఆయన అన్నారు. 2014లో మోడీ ప్రధాని అయ్యే సమయానికి 18,000 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని చెప్పారు. 3.5 లక్షల గ్రామాలకు రోడ్లతో అనుసంధానించామని అన్నారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని, ఫలితంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మంది అందులోంచి బయటపడ్డారని చెప్పారు. పేదలు, రిక్షా పుల్లర్లు, టీ విక్రేతలు, బస్సు డ్రైవర్లు మరియు క్లీనర్లతో సహా 55 కోట్ల మంది జనాభాలో 40 శాతం మందికి తీవ్రమైన అనారోగ్యాల కోసం ఆయుష్మాన్ భారత్ కింద సంవత్సరానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించామని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!