Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఇ-చలాన్లు వస్తే చాలామంది పెద్దగా పట్టించుకోరు. నెలలు, ఏళ్లు గడిచినా జరిమానాలు చెల్లించకుండా తప్పించుకు తిరిగే వాహనదారుల ఆటలకు చెక్ పెట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఊహించని సరికొత్త మార్గాన్ని తెరపైకి తెచ్చింది. ట్రాఫిక్ జరిమానాలు ఎగ్గొట్టే వారి నుంచి బకాయిలు వసూలు చేయాలంటే ఆ మొత్తాన్ని నేరుగా వారి ‘కరెంట్ బిల్లు’కు జత చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సలహా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. విద్యుత్ బిల్లు చెల్లించకపోతే పవర్ కనెక్షన్ కట్ అవుతుంది కాబట్టి, ఆ భయంతోనైనా చలాన్లు చెల్లిస్తారని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఈ అంశంపై విచారణ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం లక్షలాది ఇ-చలాన్లు జారీ చేస్తే సరిపోదని, వాటి ద్వారా పడిన ఫైన్లు వసూలు చేయడమే అసలైన సవాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకంగా రూ.45,000 కోట్ల మేర ఇ-చలాన్ల జరిమానాలు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.25,000 కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయని కోర్టు దృష్టికి వచ్చింది. మిగిలిన రూ.20,000 కోట్ల బకాయిల వసూలుకు వ్యవస్థాగతమైన కఠిన చర్యలు అవసరమని న్యాయమూర్తులు నొక్కిచెప్పారు.
Also Read
- Diwali Special Trading: దీపావళి వేళ ప్రత్యేక ట్రేడింగ్.. లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన సూచీలు..
- CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..
- IAF Creates History: చైనా సరిహద్దుల్లో హిస్టరీ క్రియేట్ చేసిన భారత వాయుసేన.. 13,629 అడుగుల ఎత్తులో గజరాజ్ ల్యాండింగ్!
- PM Modi: "ఇది నక్సలిజం రహిత తొలి దీపావళి".. బస్తర్‌లో జవాన్లతో కలిసి ప్రధాని మోడీ వేడుకలు..
ఈ క్రమంలోనే వాహనదారుల నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేసేందుకు సుప్రీంకోర్టు మరికొన్ని కీలక సూచనలు చేసింది:
సర్టిఫికెట్లకు బ్రేక్: పెండింగ్ చలాన్లు పూర్తిగా క్లియర్ అయ్యేంత వరకు వాహన రిజిస్ట్రేషన్ పత్రాల పునరుద్ధరణ (RC Renewal), డూప్లికేట్ ఆర్సీల జారీ, ఫిట్నెస్ సర్టిఫికెట్ల మంజూరును తక్షణమే నిలిపివేయాలి.
బ్లాక్‌లిస్ట్ & సీజ్: బకాయిలు ఉన్న వాహనాలను ‘పరివాహన్’ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్ చేయడంతో పాటు, వాటి యాజమాన్య బదిలీని అడ్డుకోవాలి. అవసరమైతే అలాంటి వాహనాలను నేరుగా స్వాధీనం (సీజ్) చేసుకునే చర్యలు చేపట్టాలి.
లైసెన్స్ రద్దు & పొల్యూషన్ చెక్: నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్ల లైసెన్సులను రద్దు చేయాలని, కాలుష్య నియంత్రణ (PUC) ధ్రువపత్రాలు ఇచ్చే కేంద్రాలు కూడా చలాన్ క్లియరెన్స్ లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వకుండా కట్టడి చేయాలని స్పష్టం చేసింది.
ఈ విధానాలు అమల్లోకి వస్తే, ఇన్నాళ్లూ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి చలాన్లను లైట్ తీసుకున్న వారి జేబులకు చిల్లు పడటంతో పాటు ఇళ్లల్లో చీకట్లు ముసిరే పరిస్థితి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Fire Accident: సీతాఫల్మండిలో టపాసుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
-
Maryam Nawaz: సీఎం వస్తున్నారని పరీక్షలాపేస్తారా? పాక్ సర్కార్ తీరుపై భగ్గుమన్న తల్లిదండ్రులు!
-
Team India: జట్టు నుంచి తప్పుకున్న పటీదార్.. వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్..
-
Fab Five: విరాట్ కోహ్లీకి షాక్.. గిల్‌కు ఛాన్స్..
-
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!