PM Modi: కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి, కులతత్వం.. ప్రధాని మోడీ ఫైర్..
- కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి.. కులతత్వం.. మతతత్వ..
- హర్యానా ప్రచార ముగింపుకు ముందు ప్రధాని మోడీ ఫైర్..
- కర్ణాటక.. హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది..
- హర్యానాలోని 90 సీట్లకు శనివారం పోలింగ్.. అక్టోబర్ 08న రిజల్ట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మరో రెండు రోజుల్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ముగియడానికి రెండు గంటలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అవినీతి, కులతత్వం, మతతత్వం, ఆశ్రిత పక్షపాతానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ అన్నారు. గత కొన్ని రోజులుగా తాను హర్యానాలో పర్యటిస్తున్నానని, ప్రజలు మూడోసారి బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలను అంగీకరించబోమని మోడీ గురువారం ఎక్స్ వేదికగా ట్వీట్లు చేశారు.
2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హర్యానా ప్రజల్ని సుసంపన్నం చేయడానికి కృషి చేసిందని, అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపారు. తండ్రీకొడుకుల రాజకీయాల (‘బాపు-బేటే కి రాజనీతి’) ప్రాథమిక లక్ష్యం స్వార్థం మాత్రమే అని ఆరోపించారు. హిమాచల్, కర్ణాటక కాంగ్రెస్ వైఫల్యాలను చూసిన తర్వాత హర్యానా ప్రజలు ఆ పార్టీని అస్సలు కోరుకోవడం లేదని చెప్పారు.హర్యానాకు కాంగ్రెస్ ఎప్పటికి సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వలేదని, ఆ పార్టీ అంతర్గత పోరును ప్రస్తావించారు.
Also Read
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
- Bihar: ఇన్‌స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
Read Also: Pune: ప్రధాని మోడీకి గుడి కట్టిన బీజేపీ కార్యకర్త మనస్తాపం.. బీజేపీకి గుడ్‌బై
రాహుల్ గాంధీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రిజర్వేషన్లను అంతం చేయడానికి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎప్పటికీ భారతదేశాన్ని బలోపేతం చేయడని మోడీ అన్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తం భారత్ వైపే ఉందని, ప్రపంచం చాలా ఆశలు, అంచనాలతో భారత్ వైపు చూస్తోందని, హర్యానా ప్రజలు దేశాన్ని బలోపేతం చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, హర్యానా ఓటర్లు మరోసారి బీజేపీని ఆశీర్వదించాలని అభ్యర్థించారు.
అంతకుముందు రోజు హర్యానా నుహ్‌లో జరిగిన ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. హర్యానాలో ద్వేషం, ప్రేమ మధ్య యుద్ధం జరుగుతోందని, ద్వేషాన్ని అంతం చేయాలని, భారత్ ద్వేషపూరిత దేశం కాదని, ఇది ప్రేమ కలిగిన దేశం అని అన్నారు. రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, రాజ్యాంగం అలాగే ఉండేందుకు కాంగ్రెస్ పోరాడుతోందని అన్నారు. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 08న కౌంటింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!