Raghav Chadha: వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌లో ఆప్ ఎంపీ దంపతుల ప్రత్యక్షం.. కాంగ్రెస్ విమర్శలు
- వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌లో ఆప్ ఎంపీ దంపతుల ప్రత్యక్షం
- ఎక్స్‌లో ప్రశ్నించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి
- హైకమాండ్ ఆగ్రహంతో వెంటనే పోస్టు తొలగింపు
- మిత్రపక్షాల మధ్య స్నేహం చెడిందన్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమిలో మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ ఎక్స్ ట్విట్టర్‌లో ఆప్ ఎంపీకి సంబంధించిన ఫొటోను పోస్టు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

Also Read
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, ఆయ భార్య, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా లండన్‌లో జరిగిన వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పరిణీతి చోప్రా తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసింది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. రూ.8-10 లక్షల ఖరీదైన టికెట్లను కొనుగోలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ దంపతులు వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నారని రాఘవ్ చద్దా, చోప్రా ఫొటో పోస్టుకు క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అయింది. రాగిణి నాయక్.. చోప్రా ఇన్‌స్ట్రాగామ్ నుంచే ఫొటో డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే రాగిణి నాయక్ సోమవారం సాయంత్రం 7 గంటలకు పోస్టు పెట్టిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. అంతలోనే ఆమె ఆ పోస్టును తొలగించేసింది. రాగిణి పోస్టుపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్లుగా సమాచారం. మిత్రపక్షాలపై దాడి చేయడం మానుకోవాలని అధిష్టానం హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె వెంటనే ఎక్స్ ట్విట్టర్ నుంచి పోస్టు తొలగించింది. కాకపోతే అప్పటికే ఆ పోస్టు వైరల్‌గా మారిపోయింది. జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. దీనిపై మిత్రపక్షాలైన ఆప్, కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి పరిణామం చోటుచేసుకుంటుందో చూడాలి.

నటి పరిణీతి చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ‘వింబుల్డన్ ఫైనల్స్, స్ట్రాబెర్రీలు, క్రీమ్, మరియు నా ప్రేమ … ఉత్తమ వీకెండ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఇండియా కూటమిలోని మిత్రపక్షాల విభేదాలపై బీజేపీ స్పందించింది. బీజేపీ నేత షెహజాద్ పూనావల్లా మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిసినందున ఆప్, కాంగ్రెస్ మధ్య స్నేహం చెడిందని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!