Congress: నేడు కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం.. రాహుల్ గాంధీపైనే చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ పార్టీ నేడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో పాటు కీలక నేతలకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం జరుగబోతోంది. స్టీరింగ్ కమిటీ ( సిడబ్ల్యుసి), జనరల్ సెక్రటరీలు, పీసీసీ అధ్యక్షులు, సి.ఎల్.పి నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో విస్తృత స్థాయి భేటీ జరగబోతోంది. ఢిల్లీలో అందుబాటులో ఉన్న నేతలు సమావేశానికి రావాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో జరిగే సమావేశానికి రాలేకపోతున్న నేతలు “ఆన్ లైన్” లో నైనా తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశం.
Read Also: Farooq Abdullah: రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదు.. అందరివాడు..
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మోదీ ఇంటిపేరుపై 2019 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను గురువారం విధించింది. రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అయితే కోర్టు 30 రోజలు బెయిల్ మంజూరు చేసింది. ఈలోపు ఈ తీర్పుపై స్టే ఇస్తేనే అనర్హత వేటు పడే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సమావేశం అయినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ శిక్షకు సంబంధించే ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!