టీనేజ్ దాటగానే యువత పెళ్లి గురుంచి ఎన్నెన్నో కలలు కంటారు.. ఇలాంటి అబ్బాయి, అమ్మాయి కావాలి.. ఇలా పెళ్లి చేసుకోవాలి అంటూ ముందే ఎన్నో ప్లానులు వేసుకుంటారు.. కానీ, తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఆ మధుర సమయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాంటి వాటి గురించి ముందుగానే తెలుసుకుని చేయకుండా ఉండడం మంచిది.. పెళ్లికి ముందు అస్సలు చెయ్యకూడని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పెళ్లి హడావుడి మొదలైతే చాలు చాలా మంది వస్తారు.. వారిలో మంచి వాళ్ళే కాదు.. చెడ్డ వాళ్లు కూడా ఉంటారు.. మన గురించి లేని పోనివాటిని ఎక్కించి చెబుతారు.. అయితే, వారు చెప్పే మాటలు, మిగతా కంప్లైంట్స్‌ని మీరు మైండ్‌లోకి తీసుకోవద్దు. దీని వల్ల మీ మూడ్ మొత్తం పాడైపోతుంది..
ఎవరైనా సరే ఖర్చు లేకుండా పెళ్ళి చేయలేరు. ఈ లెక్కలన్నీ కూడా మీరు మీ పార్టనర్‌తో డిస్కస్ చేయకపోవడమే మంచిది. మరీ ముఖ్యంగా పెళ్ళికి ముందు రోజు.. దీని వల్ల మెంటల్లీ కాస్తా డిస్టర్బ్ అవుతారు.. అది కొన్నిసార్లు గొడవలకు కూడా దారి తీస్తుంది..
పెళ్ళికి ముందు చాలా మంది బ్యాచ్‌లర్ పార్టీస్, ఫ్రెండ్స్‌కి పార్టీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి టైమ్‌లో ఎంజాయ్ చేస్తారు. ఆల్కహాల్ తీసుకుంటారు. కానీ, ఇలా పెళ్ళికి ముందు రోజు ఆల్కహాల్ తీసుకోవడం అంత మంచిది కాదు. దీంతో మీ రిలేటివ్స్‌కి మీపై నెగెటీవ్ ఇంపాక్ట్ పడుతుంది.. ఆ సమయంలో కొన్ని పొరపాట్లు కూడా చేస్తారు..
ఇక గతంలో మన లైఫ్ లో వేరేవాళ్లు ఉంటారు.. వాళ్ళతో బ్రేకప్ చెప్పేస్తారు.. అయితే ఇప్పుడు పెళ్లికి వాళ్లను కూడా పిలుస్తారు.. మీరు వారితో మాట్లాడడం అంత మంచిది కాదు. దీని వల్ల మీ ఫ్యూచర్ రిలేషన్‌పై కూడా పడుతుంది. అందుకే, పెళ్ళికి ముందు వారికి దూరంగా ఉంటేనే మంచిది.. అదే విధంగా, పెళ్ళి అంటేనే ముఖ్య ఘట్టం. కాబట్టి, దీని గురించి చాలా మంది టెన్షన్ పడుతుంటారు. కానీ, ఏవేవో ఆలోచించి టెన్షన్ పడొద్దు. ఒత్తిడిగా అనిపిస్తే ఆ మధుర సమయాన్ని ఎంజాయ్ చేయలేరు.. ఆ సమయంలో టెన్షన్స్ ఉంటాయి.. అవి కుటుంబ సభ్యులతో పంచుకొని మీరు ఆ సమయాన్ని ఎంజాయ్ చెయ్యండి.. ఆ సమయం మీకు మళ్లీ మళ్లీ రాదు.. ఇవన్నీ గుర్తు పెట్టుకొని పెళ్లి తంతును పూర్తి చేసుకోండి..