Jairam Ramesh: యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా ఓకే.. మరి ఎన్టీఏ చీఫ్ పరిస్థితి ఏంటి..?
- యూపీఎస్సీ చైర్మన్ రాజీనామాపై మండిపడిన కాంగ్రెస్ నేత..
- ఇప్పటి వరకు ఎన్టీఏ చీఫ్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయరా..
- వ్యవస్థలను భ్రష్టు పట్టించేవారు చాలా మంది ఉన్నారు: జైరాం రమేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jairam Ramesh: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చీఫ్ ప్రదీప్ కుమార్ జోషి ఎందుకు.. ఇప్పటి వరకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. యూపీఎస్సీలో కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో మనోజ్ సోనీతో రాజీనామా చేయించడం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
Read Also: Committee Kurrollu: ఆగష్టు 9న థియేటర్లలోకి వచ్చేస్తున్న కమిటీ కుర్రోళ్లు..
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
అయితే, యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు అధికారిక వర్గాలు ఇవాళ (శనివారం) తెలిపాయి. ఆయన పదవీకాలం 2029 మేలో ముగియనుంది. 2014 నుంచి అన్ని రాజ్యాంగ సంస్థల పవిత్రత, ప్రతిష్ట, స్వయంప్రతిపత్తి బాగా దెబ్బతిన్నాయని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పోస్ట్ చేశారు. నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి తనకు ఇష్టమైన ‘విద్యావేత్త’లలో ఒకరిని 2017లో యూపీఎస్సీ సభ్యునిగా తీసుకు వచ్చారు.. 2023లో ఆరేళ్ల పదవీకాలానికి ఛైర్మన్‌గా నియమించారని ఆరోపించారు. కానీ ఈ సోకాల్డ్ విశిష్ట పెద్ద మనిషి ఇప్పుడు తన పదవీకాలం ముగియడానికి ఐదేళ్ల ముందు రాజీనామా చేశారు.. కారణాలు ఏమైనా కావొచ్చు.. యూపీఎస్సీలో జరుగుతున్న వివాదాల దృష్ట్యా ఆయనకు ఉద్వాసన తప్పదని స్పష్టంగా కనిపించిందని జైరాం రమేష్ వెల్లడించారు.
The sanctity, character, autonomy, and professionalism of all Constitutional bodies have been badly damaged since 2014. But at times even the self-anointed non-biological PM is forced to say enough in enough.
Mr. Modi brought in one of his favourite 'academics' from Gujarat as a…
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 20, 2024
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!