AP BSF Jawan Dies on Indo-Bangladesh Border: స్మగ్లర్ల వేటలో విషాదం.. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీ జవాన్ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP BSF Jawan Dies on Indo-Bangladesh Border: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో పశువుల స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ బరాక్ నదిలో గల్లంతైన జవాన్ కె. వేణు మృతదేహం మూడు రోజుల తర్వాత కుషియారా నదిలో లభ్యమైంది. ఈ విషాద ఘటనతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన కె. వేణు బీఎస్ఎఫ్ 75వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులోని అస్సాం ప్రాంతంలో విధుల్లో భాగంగా పశువుల స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆయన బరాక్ నదిలో గల్లంతయ్యారు. అప్పటి నుంచి జవాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల తర్వాత కుషియారా నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
ఐదు నెలల పసిపాపను వదిలి వెళ్లిన జవాన్
కె. వేణుకు కేవలం 30 ఏళ్ల వయసు మాత్రమే. రెండేళ్ల క్రితమే ఆయనకు వివాహమైంది. భార్య, ఐదు నెలల పసిపాప ఉన్నారు. ఇటీవలే తన బిడ్డతో కలిసి వారం రోజుల పాటు గడిపిన వేణు తిరిగి విధుల్లో చేరేందుకు వెళ్లారు. ఇంతలోనే ఆయన మరణవార్త కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. చిన్న వయసులోనే కుటుంబానికి దూరం కావడంతో భార్య, బిడ్డ పరిస్థితిని తలచుకుని గ్రామస్థులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక, జవాన్ వేణు మృతితో గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన భౌతికకాయం రేపు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనుంది. అనంతరం స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన వేణుకు గ్రామస్థులు నివాళులర్పించేందుకు సిద్ధమవుతున్నారు..
Also Read
- Kavitha: ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు వద్దు.. కొవ్వూరులో కవిత వ్యాఖ్యలు
- Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
- Jakkampudi Raja: వైసీపీ అభ్యర్థిపై దాడి కేసు.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
- AP LocalBody Elections : తూర్పుగోదావరిలో ఎన్నికల వేడి.. రెండో రోజు భారీగా నామినేషన్లు
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
AP BSF Jawan Dies on Indo-Bangladesh Border: స్మగ్లర్ల వేటలో విషాదం.. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీ జవాన్ మృతి..
-
Suvendu Adhikari: బీజేపీలో చేరాలని ప్రణబ్ ముఖర్జీనే సలహా ఇచ్చారు..! సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు
-
Nithya Menen: ఆ స్టార్ హీరోయిన్‌కి పెళ్లి చేసుకోవాలని ఉందట!
-
IPL Auction: ఐపీఎల్ 2027 వేలంలో బెన్ స్టోక్స్‌కు గ్రీన్ సిగ్నల్.. హ్యారీ బ్రూక్‌పై వేటు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!