ఇటీవల కాలంలో బాలింతలు వైద్యం వికటించడం వల్ల చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.. సరైన వైద్యం అందకపోవడం లేక డాక్టర్లకు బదులు నర్సులు వైద్యం చేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి..ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. తెలంగాణాలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం తో నర్సు వైద్యం చేసింది.. దాంతో శిశువు మృతి చెందింది.. ఈ ఘటన పై బాలింత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు..
వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఓ శిశువు మరణించిడం కలకలం రేపింది. వైద్యురాలికి బదులు అందులో పనిచేసే నర్సు సిజేరియన్ కాన్పు చేయడంతో ఆ బిడ్డ మృతి చెందింది. బాధితులు ఆందోళన చేయడంతో గురువారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన స్రవంతికి బుధవారం రోజు పురిటినొప్పులు వచ్చాయి. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు..
ఆసుపత్రికి తీసుకొచ్చారు.. కాస్త వైద్యం చేశారు.. నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు.. అయితే ఆమెకు మళ్లీ నొప్పులు రావడంతో డాక్టర్స్ అందుబాటులో లేరు..స్టాఫ్ నర్సు సరిత మాత్రమే ఉంది. ఇక చేసేదేమి లేక ఆ నర్సు.. సిబ్బంది సహకారంతో శస్త్రచికిత్సతో కాన్పు చేశారు. ఆ బాలింత ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డలో చలనం కనిపించలేదు. దీంతో వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ శిశువు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిడ్డ మృతి చెందిందంటూ గురువారం రోజున శిశువు కుటుంబ సభ్యులు పాలకుర్తిలోని ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు..
అక్కడ ఉన్న డాక్టర్ , స్టాఫ్ నర్సులను విధుల వెంటనే తొలగించాలంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత ఆసుపత్రి సూపరింటెండెంట్ లింగమూర్తి, వైద్య విధాన పరిషత్ పర్యవేక్షకుడు సుగుణకర్‌రాజు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శిశువు తండ్రి ఇచ్చిన ఫిర్యాదును వారు తీసుకున్నారు. వైద్యురాలు, స్వప్న, స్టాఫ్ నర్సు సరితపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. దీంతో బాధితులు తమ ఆందోళనను విరమించారు. మరో విషయం ఏంటంటే అసలు వైద్యురాలు స్వప్న సెలవు పెట్టకుండానే వెళ్ళిపోయింది.. చాలా మందికి కాన్పు చేయాల్సి ఉన్నా ఆమె ఆసుపత్రి నుంచి వెళ్లిపోవడం పై సదరు అధికారులు మండిపడుతున్నారు.. ఇలాంటి ఆసుపత్రుల్లో మంచి డాక్టర్లను ఉంచాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు..