Haryana: హర్యానాలో ఆప్-కాంగ్రెస్ పొత్తుపై సందిగ్ధత.. కారణమిదేనా?
- హర్యానాలో ఆప్.. కాంగ్రెస్ పొత్తుపై సందిగ్ధత
- 20 సీట్లు అడుగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ
- తగ్గించుకోవాలంటున్న కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించేస్తున్నారు. అయితే ఇండియా కూటమిలో మాత్రం సందిగ్ధత నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయితీ తెగకపోవడంతో అయోమయం నెలకొంది. దీంతో పొత్తు పొడుస్తుందా? లేదా? అన్నది మీమాంసం నెలకొంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: చెరువుల ఆక్రమణలపై రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆప్ 20 సీట్లు ఆశిస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం అన్ని సీట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. దీంతో పొత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆప్‌కి 20 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోంది. మంగళవారం జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆప్ పోటీ చేసే స్థానాల జాబితాను ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ జాబితా అందాక తదుపరి నిర్ణయం ఉండొచ్చని సమాచారం. ఇదిలా ఉంటే హర్యానాలో పొత్తుకు రాహుల్ గాంధీ సానుకూలంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆప్ నేతలు అంటున్నారు. అయితే 20 సీట్లు కాకుండా.. కొన్ని సీట్లు తగ్గించి ఇచ్చేలా ఆప్ నేతలతో కాంగ్రెస్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Bengaluru: రూ.17లక్షల ఖరీదైన పట్టుచీరలు లూటీ.. చివరికిలా దొరికిపోయారు!
అక్టోబర్ 5న హర్యానాలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. తొలుత అక్టోబర్ 1నే ఓటింగ్‌కు షెడ్యూల్ విడుదలైంది. అయితే అక్కడ జరగనున్న ఫెస్టివల్ సందర్భంగా పోలింగ్ తేదీ మారింది. జమ్మూకాశ్మీర్‌లో మాత్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మాత్రం హర్యానాతో పాటు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Balakrishna: తెలుగు రాష్ట్రాల వరదలు.. బాలయ్య కోటి విరాళం
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!