Site icon NTV Telugu

Rahul Gandhi: యమునా నీళ్లపై వివాదం.. బోటు షికారు చేసిన రాహుల్‌గాంధీ

Rahulgandhi

Rahulgandhi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యమునా నది నీళ్లపై రాజకీయ దుమారం రేపింది. యమునా నీళ్లల్లో బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వం విష ప్రయోగం చేసిందని మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల వేళ తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోడీ సహా హర్యానా ముఖ్యమంత్రి సైనీ తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి స్వయంగా యమునా నదిలోకి దిగి నీళ్లు తాగి చూపించారు.

ఇది కూడా చదవండి: Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ అన్నారు.. గుండు సున్నా చేశారు

తాజాగా లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం యమునా నదిలో వివహరించారు. బోటులో ప్రయాణించి నీళ్లు పరిశీలించారు. స్థానికులతో కలిసి సంభాషించారు. ఈ సందర్భంగా ఆప్, బీజేపీ ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. అవినీతి, నిర్లక్ష్యంగా కారణంగానే యమునా నది కలుషితం అయిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్ వీడియో విడుదల చేశారు. ఐదేళ్ల క్రితం కేజ్రీవాల్ యమునా నదిలో స్నానం చేస్తానన్నారు. ఎప్పుడైనా చేశారా? అంటూ నిలదీశారు.

ఇది కూడా చదవండి: Boondi Laddoo: “బూందీ లడ్డూ”తో పరారీలో ఉన్న హత్య దోషి అరెస్ట్..

ఇక ఢిల్లీ ఎన్నికల ప్రచారం దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి.

Exit mobile version